రామ మందిరానికి 2.1 టన్నుల భారీ గంట

రామ మందిరానికి 2.1 టన్నుల భారీ గంట

అయోధ్య రామ మందిరంలో ఏర్పాటు చేసేందుకు 2,100 కిలోల బరువుండే  భారీ గంటను ఉత్తరప్రదేశ్‌లోని జలేసర్‌లో తయారు చేస్తున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 10, 2020 | 8:44 AM

brass bell for Ram temple: అయోధ్య రామ మందిరంలో ఏర్పాటు చేసేందుకు 2,100 కిలోల బరువుండే  భారీ గంటను ఉత్తరప్రదేశ్‌లోని జలేసర్‌లో తయారు చేస్తున్నారు. దీని తయారీ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ముస్లిం కళాకారుడు ఇక్బాల్‌ మిస్త్రీ ఈ గంటను డిజైన్‌ చేయగా, దావు దయాళ్ కుటుంబం తయారు చేస్తోంది. ఇందులో హిందూ, ముస్లిం కళాకారులు ఇద్దరూ పాల్గొన్నారు. ఈ గంట శబ్దం సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుందని దావు దయాళ్‌ అన్నారు

దీనిపై జలేసర్ కార్పొరేషన్ చైర్మన్ వికాస్ మిట్టల్ మాట్లాడుతూ.. ”గతేడాది నవంబర్‌లో రామాలయ నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ సుప్రీం తీర్పు ఇవ్వగానే నిర్మోహి అఖాడా మమ్మల్ని సంప్రదించింది. 2,100 కిలోల బరువుండే భారీ గంటను తయారు చేయాలని కోరింది. దీనిని దైవ కార్యంగా భావిస్తూ దేశంలోనే అతిపెద్ద గంటల్లో ఒకటైన గంటను తయారు చేయించి మేమే ఆలయానికి ఇవ్వాలనుకున్నాం’’ అని తెలిపారు. ఈ గంట కోసం రూ.21 లక్షలు వెచ్చిస్తున్నట్లు వారు వివరించారు. కాగా హిందూ, ముస్లిం మతాలకు చెందిన 25 మంది పనివారు రోజుకు 8 గంటల చొప్పున నెల రోజుల పాటు ఈ గంట కోసం పనిచేశారు. కంచుతోపాటు బంగారం, వెండి, ఇత్తడి, రాగి, సీసం, తగరము, ఇనుము, పాదరసం వంటి అష్టధాతువులను ఈ గంట కోసం ఉపయోగించారు.

Read This Story Also: వంటలక్క అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu