ఛత్రపతి విగ్రహం తొలగింపు..లాల్‌బాగ్‌లో శివసేన నిరసనలు

ఛత్రపతి విగ్రహం తొలగింపు..లాల్‌బాగ్‌లో శివసేన నిరసనలు

కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహం తొలగింపుపై శివసేన నిరసన కార్యక్రమాలు చేపట్టింది. బెల్గాం జిల్లాలోని ఓ గ్రామంలో ఇటీవల ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తొలగించారు. ఈ ఘటనపై..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 10, 2020 | 7:31 AM

కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహం తొలగింపుపై శివసేన నిరసన కార్యక్రమాలు చేపట్టింది. బెల్గాం జిల్లాలోని ఓ గ్రామంలో ఇటీవల ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తొలగించారు. ఈ ఘటనపై ముంబైలోని లాల్‌బాగ్‌లో శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. బ్యానర్లను ప్రదర్శించారు. దిష్టి బోమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో సోషల్ డిస్టెన్స్‌ను పాటించకుండా.. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు. మరోవైపు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా విగ్రహం తొలగింపును ఖండించారు. వెంటనే తొలగించిన ప్రదేశంలో తిరిగి విగ్రహాన్ని ప్రతిష్టించాలంటూ డిమాండ్ చేశారు.

Read More :

కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములుకు కరోనా

మహారాష్ట్రలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

తమిళనాడులో 3 లక్షలకు చేరువలో పాజిటివ్‌ కేసులు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu