Himachal Pradesh Rains: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. 14 మంది మృతి.. మరో 3 రోజులపాటు కుంభవృష్టి కురిసే అవకాశం

| Edited By: Ravi Kiran

Aug 20, 2022 | 3:59 PM

హిమాచల్ ప్రదేశ్‌లో ఆగస్టు 25 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని దీంతో కొండచరియలు విరిగిపడే ప్రమాదం హిమాచల్ ప్రదేశ్ విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరిక జారీ చేసింది

Himachal Pradesh Rains: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. 14 మంది మృతి.. మరో 3 రోజులపాటు కుంభవృష్టి కురిసే అవకాశం
Himachal Pradesh Rains
Follow us on

Himachal Pradesh Rains: హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా ఆస్థి నష్టం వాటిల్లింది. భారీ వర్షాల నేపథ్యంలో వివిధ ఘటనల్లో 14 మంది దుర్మరణం చెందారు. మరోవైపు భారీ వర్షాలకు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో నూర్పూర్ సమీపంలోని చక్కి ఖాడ్‌లో బ్రిటిష్ వారు నిర్మించిన రైల్వే వంతెన కొట్టుకుపోయింది. మండి జిల్లాలో ఆకస్మికంగా వరద ఉదృతి పెరిగింది. ఇళ్లలోకి ప్రవేశించింది.. కొంతమంది గ్రామస్థులు ఇళ్లలో చిక్కుకుపోయారు. తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.

మరోవైపు చంబా జిల్లాలో, శనివారం ఉదయం వర్షం వలన కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇల్లు కూలి ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతుల ముగ్గురి మృతదేహాలను శిధిలాల నుంచి వెలికితీశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, తెల్లవారుజామున 4.15 గంటలకు మండిలో వరదలు రావడంతో బాల్, సదర్, తునాగ్, మండి, లమథాచ్‌లోని పలు ఇళ్లు, దుకాణాల్లోకి నీరు చేరింది. వరదల కారణంగా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన పలు వాహనాలు దెబ్బతిన్నాయని, స్థానికులు ఇళ్లలోనే చిక్కుకుపోయారని తెలిపారు. కాంగ్రాలో వర్షం కారణంగా, నూర్పూర్ సమీపంలోని చక్కి ఖాడ్‌లో బ్రిటిష్ వారు నిర్మించిన రైల్వే వంతెన కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తూ.. నదిలోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో.. ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే వంతెన కూలిపోయిన సమయంలో ఉన్నప్పుడు వంతెనపై ఎవరూ లేరు. దీంతో పెను ప్రమాదం  తప్పింది.

మండి జిల్లాలో ఈరోజు పాఠశాల మూసివేత 

ఇవి కూడా చదవండి

మండి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శనివారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మండిలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో    మండి జిల్లాలోని కళాశాలలు , ITI మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు  అంగన్‌వాడీలకు సెలవులు ప్రకటించారు.

మండి, కులు, సిమ్లా సహా ఈ జిల్లాల్లో వర్షాలు : 
హిమాచల్ ప్రదేశ్‌లో ఆగస్టు 25 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని దీంతో కొండచరియలు విరిగిపడే ప్రమాదం హిమాచల్ ప్రదేశ్ విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరిక జారీ చేసింది. కాంగ్రా, చంబా, మండి, కులు, సిమ్లా, సిర్మౌర్, సోలన్, హమీర్‌పూర్, ఉనా, బిలాస్‌పూర్ జిల్లాల్లో రానున్న మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ సుదేష్ కుమార్ మోఖ్తా తెలిపారు.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..