Himachal Pradesh Election 2022: ప్రారంభమైన పోలింగ్.. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని విజ్ఞప్తి

|

Nov 12, 2022 | 9:57 AM

హిమాచల్‌ ప్రదేశ్‌లో పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 68 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. 7,881 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు.

Himachal Pradesh Election 2022:  ప్రారంభమైన పోలింగ్.. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని విజ్ఞప్తి
People queue up at a polling station as voting begins for the Himachal Pradesh Assembly elections
Follow us on

ఉదయం 8 గంటల  హిమాచల్‌ ప్రదేశ్‌లో పోలింగ్‌ మొదలైంది. సాయంత్రం పోలింగ్ ప్రక్రియ 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 68 నియోజకవర్గాల్లో ఓటింగ్‌ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో..కాంగ్రెస్‌, బీజేపీ, ఇతర పార్టీల నుంచి మొత్తం 412 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 24 మంది మహిళలు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌, కుటుంబ సభ్యులతో పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. అంతకుముందు..మండిలో ప్రత్యేక పూజలు చేశారు.  68 సెగ్మెంట్లకు ఒకే దశలో జరుగుతున్న ఎన్నికల్లో.. మొత్తం 55 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

శనివారం పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు 67 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు పహారా కాస్తున్నాయి. మరోవైపు, 11,500 మంది రాష్ట్ర పోలీసు సిబ్బందితో సహా దాదాపు 30వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. 1,86,681 యువ ఓటర్లు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు మహిళలు, యువత అత్యధిక సంఖ్యలో ఓటు వేయాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. చలి ఎక్కువగా ఉన్నందున.. ఓటింగ్‌ నెమ్మదిగా సాగుతోంది. 2017 ఎలక్షన్స్‌లో NDA 43, కాంగ్రెస్‌ 22 స్థానాలు దక్కించుకున్నాయి. వరుసగా రెండోసారి రూలింగ్‌లోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుంది. అధికారం దక్కించుకునేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్​ అన్ని వ్యూహాలను అమలు చేస్తుంది.   ఆమ్​ఆద్మీ పార్టీ కూడా తమ లక్ టేస్ట్ చేసుకుంటుంది. 2017లో 75.57శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసారి పెరిగే ఛాన్సులు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..