
ఇంట్లో ఉండాలంటే నిత్యవసర వస్తువులు తప్పనిసరిగా ఉండాల్సిందే. నిత్యవసర ధరలు నానాటికి పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక వంటనూనె ధరలకు మాత్రం రెక్కలొచ్చాయనే చెప్పాలి. కానీ ఇప్పుడు పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొంత ఊరటనిచ్చే తీపి కబురు వచ్చింది. ఇకనుంచి వంటనూనేనె ధరలపై రూ.37 తగ్గించనున్నారు. కానీ ఇది దేశమంతటా కాదండోయ్.. కేవలం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ఈ అవకాశంపై కీలక ప్రకటన చేసింది. ప్రజా పంపిణి వ్యవస్థ కింద ఇకనుంచి ఆవాల వంటనూనెపై సబ్సిడీ ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది.
రేషన్ కార్డు ఉన్నవారికి సబ్సిడీలో తక్కువ ధరకే వంటనూనె అందించనున్నట్లు పేర్కొంది. గతంలో ఉన్న ధరలతో పోలిస్తే ఇప్పుడు లబ్దిదారులకు ఈ ఆవాల నూనెను లీటరుకు రూ.37 తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్ సింగ్ వెల్లడించారు. రూ.110 కే ఆయిల్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. జూన్ 2023కి ముందు ఆంతోదయ అన్న యోజన కింద దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికి ఆవాల నూనె లీటరుకు రూ.142 లభించేదని.. అలాగే దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారు వారికి రూ.147 చొప్పున నూనెను పొందే వారని పేర్కొన్నారు. అయితే ఈ ధరల తగ్గింపుతో సామాన్యులకు కొంత ఊరట కలుగుతుందనే చెపవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం