AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రీడాకారులకు నాసిరకం భోజనాన్ని పెడుతున్న సాయ్‌

అంతటా అవినీతే! ఆఖరికి క్రీడాకారులకు అన్నం పెట్టే చోట కూడా కాసుల కక్కుర్తే! ఇక పతకాలు ఎలా వస్తాయి? పాటియాలాలోని నేతాజీ సుభాష్‌ జాతీయ క్రీడాసంస్థ అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది..

క్రీడాకారులకు నాసిరకం భోజనాన్ని పెడుతున్న సాయ్‌
Anil kumar poka
|

Updated on: Sep 09, 2020 | 1:05 PM

Share

అంతటా అవినీతే! ఆఖరికి క్రీడాకారులకు అన్నం పెట్టే చోట కూడా కాసుల కక్కుర్తే! ఇక పతకాలు ఎలా వస్తాయి? పాటియాలాలోని నేతాజీ సుభాష్‌ జాతీయ క్రీడాసంస్థ అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది.. వచ్చిన డబ్బును అక్కడి అధికారులు సుష్టుగా భోంచేసి క్రీడాకారులకేమో నాసిరకం భోజనానికి పెడుతున్నారు.. మొన్నీమధ్యనే అక్కడి సిబ్బంది భౌతిక దూరాన్ని పాటించడం లేదన్న వార్త బయటకు వచ్చింది.. అదే కాకుండా ఇద్దరు బాక్సర్లు క్వారంటైన్‌ నిబంధనలను బ్రేక్‌ చేశారంటూ కూడా మీడియాలో కథనాలు వచ్చాయి.. ఇక ఇప్పుడేమో అథ్లెట్లకు సరైన తిండి కూడా పెట్టడం లేదనే విషయం బయటకు వచ్చింది.. భారత స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.. అసలు వంటగది మొత్తం అపరిశుభ్రంగా ఉంటుందట! ఆహార నాణ్యత కూడా అంతంత మాత్రమేనట! అథ్లెట్లకు పౌష్టికాహారాన్ని పెట్టాల్సిన అధికారులు కాసుల కక్కుర్తికి ఇంత దరిద్రానికి పాల్పడుతున్నారు. మొన్న హిమదాస్‌కు పెట్టిన భోజనంలో వెంట్రుకలు, గోళ్లు వచ్చాయట! వెంటనే ఆమె ఈ విషయాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు దృష్టికి తీసుకెళ్లింది.. తనకు పెట్టిన తిండి ఫోటోలను కూడా తీసి వాటిని ఎన్‌ఐఎస్‌ పాలక అధికారులకు పంపింది.. ఈ విషయాన్ని కేంద్ర క్రీడామంత్రి కిరణ్‌ రిజుజు చాలా సీరియస్‌గా తీసుకున్నారు.. భారత స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులను లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ తీసుకున్నారు.. జాతీయ క్రీడా సంస్థలోని కిచెన్‌ అపరిశుభ్రంగా ఉండటం, నాసిరకమైన ఆహారాన్ని క్రీడాకారులకు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నారు.

'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు