Karnataka Hijab Row: కొనసాగుతున్న హిజాబ్ వివాదం.. కర్నాటక హైకోర్టులో వాడివేడిగా వాదనలు..!

|

Feb 15, 2022 | 7:24 AM

Karnataka Hijab Row: కర్నాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వివాదంపై కర్నాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు వాడివేడి వాదనలు సాగాయి.

Karnataka Hijab Row: కొనసాగుతున్న హిజాబ్ వివాదం.. కర్నాటక హైకోర్టులో వాడివేడిగా వాదనలు..!
Follow us on

Karnataka Hijab Row: కర్నాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వివాదంపై కర్నాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు వాడివేడి వాదనలు సాగాయి. ముస్లిం మహిళలు హిజాబ్‌ ధరించాలని ఖురాన్‌లో ఉందని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదించారు. హిజాబ్‌ను నిషేధిస్తూ చట్టం ఎక్కడుందని త్రిసభ్య ధర్మాసనం ముందు పిటిషనర్‌ తరపు న్యాయవాది ప్రశ్నించారు. డ్రెస్‌కోడ్‌ పేరుతో కర్నాటక ప్రభుత్వం హక్కులను హరిస్తోందని వాదించారయన. హిజాబ్‌ ధరించాలా? వద్దా? అనే నిర్ణయాన్ని తీసుకునే అధికారాన్ని కాలేజ్ కమిటీలకు కట్టబెట్టడంపై పిటిషనర్‌ తరపు న్యాయవాది కామత్‌ తీవ్ర అభ్యంతరం తెలిపారు. మరోవైపు హిజాబ్‌ వివాదంపై కర్నాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఖురాన్‌ చెప్పిందంతా ఆచరణసాధ్యమా? అని పిటిషనర్‌ తరుపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. కాగా, ఇవాళ కూడా ఇదే అంశంపై కోర్టులో వాదనలు జరుగనున్నాయి.

ఇదిలాఉంటే.. కర్నాటకలోని ఒక కాలేజీలో చెలరేగిన హిజాబ్ వివాదం ఇతర స్కూళ్లు, కాలేజీలకూ వ్యాపిస్తోంది. తాజాగా మాండ్యలోని రోటరీ స్కూలుకు హిజాబ్‌ ధరించి వచ్చిన విద్యార్థులను యాజమాన్యం అనుమతించలేదు. కోర్టు ఆదేశాల ప్రకారం హిజాబ్‌ ధరించి వచ్చిన వారికి ప్రవేశం లేదన్నారు. ఈ అంశంపై కొందరు తల్లిదండ్రులకు, టీచర్లకు మధ్య గొడవ జరిగింది. హిజాబ్‌ ధరించి తీరతామన్న వారికి వెనక్కి పంపించేశారు. తొలగించినవారిని స్కూల్లోకి అనుమతించారు. ఈ విధానాలపై విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు.

Also read:

Multibagger Stock: రూ.10 వేలు పెట్టుబడి పెడితే రూ. 2.43 లక్షలు.. అది సంవత్సరంలోనే.. కాసులు కురిపించిన స్టాక్..

Joint Pains – Yoga: కీళ్ల నొప్పులకు చక్కని ఉపశమనం.. ఇంట్లోనే ఇలా చేయండి చాలా.. మీ నొప్పులు మాయం..

IPL 2022: రోహిత్-ధోనీలకు సవాలు విసరనున్న పంత్-అయ్యర్.. సై అంటోన్న కొత్త సారథులు.. 10మంది కెప్టెన్లు వీరే..