Viral Video: తీవ్రమైన చలిలో జవాన్ల శిక్షణ.. వైరల్‌ అవుతున్న వీడియో..!

Viral Video: ఆర్మీ జవాన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో పడుతున్న కష్టాలు అన్నీ.. ఇన్ని కావు. వాన‌కు త‌డుస్తారు. ఎండ‌కు ఎండుతాడు. చ‌..

Viral Video: తీవ్రమైన చలిలో జవాన్ల శిక్షణ.. వైరల్‌ అవుతున్న వీడియో..!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 15, 2022 | 7:16 AM

Viral Video: ఆర్మీ జవాన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో పడుతున్న కష్టాలు అన్నీ.. ఇన్ని కావు. వాన‌కు త‌డుస్తారు. ఎండ‌కు ఎండుతాడు. చ‌లికి వ‌ణుకుతారు. ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి దేశం కోసం సేవలందిస్తారు.  దేశాన్ని కంటికి రెప్ప‌లా కాపాడుకుంటారు. అందుకే మ‌నం జ‌వాన్ల‌కు చాలా గౌరవం ఇస్తాము. అయితే ఐటీబీపీ జవాన్లకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు (ITBP) మైనస్ 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద  శిక్షణ తీసుకుంటున్న వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ వార్తా సంస్థ ఈ వీడియోను ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. జవాన్లు ఉత్తరాఖండ్‌ సరిహద్దులో అత్యంత తీవ్రమైన చలిలో శిక్షణ తీసుకుంటున్న దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు. మంచుతో కప్పబడిన పర్వతాలలో ఐటీబీపీ జవాన్లు భారీ కవాతులు చేశారు.

అయితే కఠినమైన శిక్షణ ప్రక్రియలో జవాన్లకు సూచనలను చేస్తున్నాడు బోధకుడు. విపరీతమైన చలి మధ్య కూడా జవాన్లు పూర్తి శక్తితో, ఉత్సాహంతో కవాతులు చేయడం అందరిని ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఇప్పటివరకు ఈ వీడియోను 49వేలకుపైగా మంది వీక్షించారు. అలాగే 4వేల వరకు లైక్స్‌ వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు జవాన్లను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.