బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు రూ. 5 లక్షల జరిమానా విధించింది. బీజేపీ నేత సువెందు అధికారిపై తాను వేసిన కేసును విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ కౌశిక్ చందాను తొలగించాలని మమత డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆమెకు కోర్టు ఈ ఫైన్ విధించింది. దీన్ని కోవిద్ బాధిత లాయర్ల కుటుంబాలకు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఇక ఈ కేసు విచారణ నుంచి తాను వైదొలగుతున్నట్టు జస్టిస్ చందా ప్రకటించారు. ఈ కేసు విచారణను ఈ జడ్జి నుంచి మరో జడ్జికి బదిలీ చేయాలని …ఈయన బీజేపీ నేతలతో కలిసి తిరగడాన్ని తాము చూశామని మమతా బెనర్జీ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. అయితే ఒక జడ్జి ఒక రాజకీయ పార్టీ నేతలతో కనబడడం సహజమేనని..కానీ కేసుల విచారణ సందర్బంలో ఎలాంటి పక్షపాతం చూపబోరని జస్టిస్ చందా అన్నారు. కేసుల్లో ఒకరిపట్ల ప్రత్యేక ఆసక్తి అన్నది ఉండదన్నారు. అసలు కేసు విచారణ జరగకముందే తన నిర్ణయంపై తీవ్ర ప్రభావం చూపడానికి ప్రయత్నం జరిగిందన్నారు.
కలకత్తా హైకోర్టుకు జడ్జిగా రాకముందు జస్టిస్ చందా బీజేపీ ప్రభుత్వానికి అదనపు సొలిసిటర్ జనరల్ గా వ్యవహరించారని కలకత్తా బార్ అసోసియేషన్ తెలిపింది. తాను ఒకప్పుడు బీజేపీ కన్వీనర్ గా ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని.. కానీనేను ఒక పార్టీ పట్ల పక్షపాతం చూపే వ్యక్తిని కానని చందా పేర్కొన్నారు. జూన్ 18 న కేసు విచారణ జరిగిన వెంటనే.. తృణమూల్ కాంగ్రెస్ నేతలు.. బీజేపీ వారితో తాను ఉన్న ఫొటోలతో కూడిన ట్వీట్లు చేశారని ఆయన వెల్లడించారు. నందిగ్రామ్ ఎన్నిక ఫలితాలను సవాల్ చేస్తూ మమతా బెనర్జీ పిటిషన్ వేసిన విషయం గమనార్హం. ఇక ఈ కేసు విచారణను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బిందాల్ మరో బెంచ్ కి నివేదించనున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Pawan Kalyan: ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన జనంతోనే ఉంటుంది.. పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్
Dhoni Birthday: ఎంస్ ధోనీ బర్త్‌డే స్పెషల్.. కెప్టెన్‌గా మహీ సాధించిన ఐదు గొప్ప రికార్డులు ఇవే..