Coloud Burst: భారీ వర్షాలకు చెరువులను తలపిస్తోన్న రోడ్లు.. వరదలో కార్లు ఎలా కొట్టుకుపోతున్నాయో చూడండి. ఎక్కడో తెలుసా.?

|

Jul 12, 2021 | 1:44 PM

Rain Floods: ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా హిమచల్‌ ప్రదేశ్‌ ధర్మశాలలోని కొన్ని ప్రాంతాలు అతాలకుతలమవుతున్నాయి. ముఖ్యంగా భాగ్సు ఏరియాలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై నీరు అత్యంత...

Coloud Burst: భారీ వర్షాలకు చెరువులను తలపిస్తోన్న రోడ్లు.. వరదలో కార్లు ఎలా కొట్టుకుపోతున్నాయో చూడండి. ఎక్కడో తెలుసా.?
Heavy Rains
Follow us on

Coloud Burst: ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా హిమచల్‌ ప్రదేశ్‌ ధర్మశాలలోని కొన్ని ప్రాంతాలు అతాలకుతలమవుతున్నాయి. ముఖ్యంగా భాగ్సు ఏరియాలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై నీరు అత్యంత వేగంతో ప్రవహిస్తోంది. దీంతో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. నీటి ప్రవాహం కారణంగా కార్లు కొట్టుకుపోతున్నాయి. దీంతో స్థానికులు ఈ వీడియోలను తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియోలు వైరల్‌గా మారాయి. ఇక రానున్న రెండు రోజులు కూడా హిమచల్‌ ప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారతీయ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే అధికారులు ఆరెంజ్‌ అలెర్ట్‌ కూడా జారీ చేశారు.

ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జన జీవితం అస్తవ్యస్తమైంది. ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుల నేపథ్యంలో భారీగా పర్యాటకులు రావడం కూడా ఇబ్బందిగా మారింది. భారీ వర్షాల కారణంగా మాంగీ నదిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. వరద తీవ్రత మరింత పెరగడంతో నది పోటెత్తింది దీంతో ప్రఖ్యాత బౌద్ధ పుణ్యక్షేత్రం ధర్మశాల నీటితో నిండిపోయింది. ఆకస్మిక వరదతో భాగ్‌సు నాగ్ మొత్తం వరద నీటితో నిండిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. హిమాచ‌ల్‌ ప్రదేశ్‌తో పాటు నార్త్‌ ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో పిడుగులు పడి 68 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Also Read: Lakshmi Parvathi: తెలుగు అకాడమీ పేరు మార్పుపై నందమూరి లక్ష్మీపార్వతి స్ట్రాంగ్ రియాక్షన్

L.Ramana: గులాబీ గూటికి చేరిన ఎల్ ర‌మ‌ణ.. TRS పార్టీ సభ్యత్వం ఇచ్చి స్వాగతం పలికిన మంత్రి KTR

Kishan Reddy: రాజ్యాంగం అసలు ప్రతి నేషనల్ మ్యూజియంలోనే ఉంది, కిషన్ రెడ్డి దంపతులకు స్వాత్మానందేంద్ర ఆశీస్సులు