ఇది మామూలు కథ కాదు.. వాట్సప్ స్టేటస్‌తో భార్య గుట్టురట్టు.. ఆమె చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాంకే..
పెళ్లయి 20 ఏళ్లు.. కళ్లముందు ఇద్దరు కొడుకులు.. ఎంతో సంతోషంగా సాగిపోతున్న కాపురం. కానీ.. సీన్ కట్ చేస్తే ఆ భార్య పరాయి వ్యక్తి మోజులో పడింది. చివరకు ఇద్దరు పిల్లలను, భర్తను నడిరోడ్డుపై వదిలేసి.. ప్రియుడితో కలిసి లేచిపోయింది. అంతటితో ఆగకుండా రహస్యంగా పెళ్లి కూడా చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఈ మధ్య వివాహేతర సంబంధాల ట్రెండ్ నడుస్తుంది. ప్రియుడి కోసం భర్తలను చంపడం భార్యలకు ఒక ప్యాషన్‌గా మారింది. మరికొంత మంది భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోతున్నారు. తాజాగా వివాహ బంధానికి ఉన్న పవిత్రతను అపహాస్యం చేస్తూ హర్యానాలోని హిసార్ జిల్లాలో కలకలం రేపే ఘటన వెలుగుచూసింది. పెళ్లయి రెండు దశాబ్దాలు గడిచినా, ఇద్దరు పిల్లలు ఉన్నారనే కనీస బాధ్యత కూడా లేకుండా ఒక మహిళ.. ప్రియుడితో కలిసి లేచిపోయింది. అంతటితో ఆగకుండా రాజస్థాన్‌లోని ఒక గుడిలో రహస్యంగా రెండో పెళ్లి కూడా చేసుకుంది. ఈ మోసాన్ని భరించలేకపోయిన బాధితుడు న్యాయం కోసం కోర్టు మెట్లెక్కాడు. జగాన్ గ్రామానికి చెందిన మనీష్ కుమార్‌కు 2006లో రేఖ అనే మహిళతో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే 2023లో మనీష్ ఉద్యోగ రీత్యా భివానీ ప్రాంతానికి మారాడు. ఆ సమయంలో సతీష్ అనే వ్యక్తి వీరి ఇంటికి తరచూ వస్తూ రేఖతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
పట్టించిన వాట్సప్ స్టేటస్
గత ఏడాది నవంబర్‌లో రేఖ తన తండ్రి, సోదరుడితో కలిసి అకస్మాత్తుగా ఇల్లు వదిలి మాయమైంది. దీనిపై భర్త పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయితే డిసెంబర్ 1న తన అత్తగారి తరపు బంధువుల సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్‌లను చూసి మనీష్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అందులో అతని భార్య రేఖ.. ప్రియుడు సతీష్‌తో కలిసి రాజస్థాన్‌లోని ఒక గుడిలో రెండో పెళ్లి చేసుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి.
ఎక్కువ మంది చదివినది: ట్రైన్‌లో ఇవేం పనులు సామీ.. కొత్త జంట చేసిన పనికి అంతా అవాక్కు.. వీడియో చూడండి..
పిల్లలను తీసుకుని పెళ్లి మండపానికి వెళ్లిన భర్త..
విషయం తెలిసిన వెంటనే మనీష్ తన వృద్ధురాలైన తల్లిని, ఇద్దరు కొడుకులను తీసుకుని నేరుగా రాజస్థాన్‌లోని ఆ గుడికి చేరుకున్నాడు. అక్కడ రేఖ, సతీష్ ఇద్దరూ దండలు మార్చుకుని, ఏడడుగులు వేస్తూ కనిపించారు. పెళ్లి తర్వాత ఆ జంట కొత్త పెళ్లికూతురు, పెళ్లికొడుకులా ఫొటోషూట్‌లు కూడా చేయించుకున్నారు. ఈ అక్రమ పెళ్లిని మనీష్ గట్టిగా నిలదీయగా.. రేఖ కుటుంబ సభ్యులు, ప్రియుడు సతీష్ కలిసి అతడిని తీవ్రంగా దూషించి, చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి తరిమేశారు.
ఇల్లు, భూమి లాక్కుని రోడ్డున పడేశారు..
ఈ ఘోరమైన మోసం వెనుక పెద్ద ఆర్థిక కుట్ర కూడా దాగి ఉందని బాధితుడు ఆరోపించాడు. అత్తగారి తరపు వారు ప్లాన్ ప్రకారం మనీష్‌కు చెందిన భూమిని, పక్కా ఇళ్లను అమ్మించి ఆ సొమ్మునంతా కాజేశారు. దీంతో మనీష్ తన ఇద్దరు పిల్లలు, వృద్ధురాలైన తల్లితో కలిసి పూర్తిగా రోడ్డున పడ్డాడు. ఈ ఘటనతో తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో కూడా చేరాడు.
కోర్టు సీరియస్.. ఫ్యామిలీ మొత్తానికి నోటీసులు..
ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అయిన తర్వాత మనీష్ ధైర్యం తెచ్చుకుని.. భార్య రెండో పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోల సాక్ష్యాలను సేకరించాడు. తన న్యాయవాది ద్వారా హిసార్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు.. నిందితురాలైన భార్య రేఖ, ఆమె ప్రియుడు సతీష్‌తో పాటు ఆమె తండ్రి, సోదరుడు, వదిన, తల్లి, సోదరి పూనమ్‌లపై చట్టపరమైన నోటీసులు జారీ చేసింది. నిందితులంతా ఈ ఏడాది నవంబర్ 25 లోగా కోర్టుకు హాజరై తమ వివరణ ఇచ్చుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు.
