Haryana Election 2024: అధికారమే లక్ష్యంగా ఖట్టర్-సైనీ ద్వయం కొత్త వ్యూహాం.. మంత్రులకు కీలక బాధ్యతలు!

వచ్చే ఏడాది హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ యాక్టివ్ మోడ్‌లో కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితమే రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడిని మార్చింది. తాజాగా రాష్ట్ర పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రాష్ట్ర అధ్యక్షుడు నయాబ్ సింగ్ సైనీల జోడీ ఎన్నికల సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో బీజేపీ సంస్థాగతంగా అనేక పెనుమార్పులు కనిపిస్తున్నాయి.

Haryana Election 2024: అధికారమే లక్ష్యంగా ఖట్టర్-సైనీ ద్వయం కొత్త వ్యూహాం.. మంత్రులకు కీలక బాధ్యతలు!
Cm Manohar Lal Khattar, Nayab Singh Saini

Updated on: Nov 22, 2023 | 6:27 PM

వచ్చే ఏడాది హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ యాక్టివ్ మోడ్‌లో కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితమే రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడిని మార్చింది. తాజాగా రాష్ట్ర పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రాష్ట్ర అధ్యక్షుడు నయాబ్ సింగ్ సైనీల జోడీ ఎన్నికల సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో బీజేపీ సంస్థాగతంగా అనేక పెనుమార్పులు కనిపిస్తున్నాయి. మంత్రివర్గంలోనూ కీలక మార్పులు ఉంటాయని తెలుస్తోంది. హర్యానాలో మరోసారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ అప్పుడే సన్నాహాలు చేస్తోంది.

ఈసారి బీజేపీ పార్టీలో రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించవచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించి, నవంబర్ 24న రాష్ట్ర పార్టీ విస్తృతస్థాయిలో ముఖ్యమైన సమావేశం ఏర్పాటు జరుగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైనీతో పాటు కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరుకానున్నారు. దీంతో పాటు 2019 ఎన్నికల్లో లోక్‌సభ, అసెంబ్లీకి అభ్యర్థులుగా నిలిచిన ప్రస్తుత ఎంపీలు, నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.

నవంబర్ 24న జరిగే సమావేశంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహక చర్యలపై చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్ర ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించనున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న అంశాలపై కూడా చర్చించనున్నారు. దీనితో పాటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఏ అంశంపై ఎలాంటి వ్యూహం రచిస్తుందనే అంశంపై కూడా మేధోమథనం జరగనుంది. అంతేకాదు పార్టీ బలోపేతంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.

తాజాగా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఓపీ ధంఖర్‌ను కాదని, నయీబ్ సింగ్ సైనీని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది బీజేపీ అధిష్టానం. దీంతో ఇప్పుడు సాధారణ మంత్రుల మార్పుపై పార్టీలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని పెద్ద ముఖాలకు ఈ పదవుల్లో స్థానం కల్పించవచ్చు. సంస్థకు సంబంధించిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ సహా ఇతర పోస్టులలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…