Watch Video: బంగారం స్మగ్లింగ్‌లో కిలాడీ తెలివితేటలు.. వీడియో చూస్తే మీరు షాకవుతారు!
బంగారం అక్రమ రవాణాలో స్మగ్లర్లు కొత్త తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. అయితే విమానాశ్రయ అధికారులు అప్రమత్తంగా ఉంటూ వారి స్మగ్లింగ్ ప్రయత్నాలను వీలైనంత మేరకు అడ్డుకుంటూనే ఉన్నారు. తాజాగా చండీగఢ్ కస్టమ్స్ అధికారులు ఓ స్మగ్లింగ్ వ్వవహారాన్ని చాకచక్యంగా ఛేదించారు.
బంగారం అక్రమ రవాణాలో స్మగ్లర్లు కొత్త తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. అయితే విమానాశ్రయ అధికారులు అప్రమత్తంగా ఉంటూ వారి స్మగ్లింగ్ ప్రయతనాలను అడ్డుకుంటూనే ఉన్నారు. తాజాగా చండీగఢ్ కస్టమ్స్ అధికారులు ఓ స్మగ్లింగ్ వ్వవహారాన్ని చాకచక్యంగా ఛేదించారు. క్రెడిట్ కార్డు మాటున గోల్డ్ షీట్స్ అక్రమ రవాణాకు ప్రయత్నించి స్మగ్లర్ దొరికిపోయాడు. ఐదు గోల్డ్ షీట్స్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని బరువు దాదాపు 520 గ్రాములుగా అధికారులు వెల్లడించారు. సోషల్ మీడియాలోనూ ఈ వీడియో వైరల్‌గా మారింది.
రెండ్రోజుల క్రితం ఢిల్లీ విమానాశ్రయంలో ఓ వ్యక్తి జ్యూస్ ప్యాకెట్లలో గోల్డ్ బిస్కట్లను దాడి తరలిస్తూ తనిఖీల్లో దొరికిపోయాడు. ఇప్పుడు చండీగఢ్‌లో మరో వ్యక్తి ఇలా క్రెడిట్ కార్డు మాటున బంగారం స్మగ్లింగ్‌కు ప్రయత్నించి తనిఖీల్లో దొరికిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలు చూసిన వారు స్మగ్లింగ్‌కు ఏం తెలివిరా నాయనా..అంటూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు.