Israel – Hamas: ఇజ్రాయెల్‌తో సంధికి దగ్గరవుతున్నాం: హమాస్. సోషల్ మీడియాలో పోస్ట్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం సందర్భంగా రెండింటి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడి జరిపిన హమాస్ మిలిటెంట్లు రెండు వందల మందికి పైగా తమ చెరలో బంధించారు. వారి విడుదల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోపక్క వారిని విడిచిపెట్టేవరకూ దాడులు ఆపబోమంటూ గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో సంధి ప్రయత్నాలు తుదిదశకు చేరుకుంటున్నట్లు అమెరికా తెలిపింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం సందర్భంగా రెండింటి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడి జరిపిన హమాస్ మిలిటెంట్లు రెండు వందల మందికి పైగా తమ చెరలో బంధించారు. వారి విడుదల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోపక్క వారిని విడిచిపెట్టేవరకూ దాడులు ఆపబోమంటూ గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో సంధి ప్రయత్నాలు తుదిదశకు చేరుకుంటున్నట్లు అమెరికా తెలిపింది. గతంలో కంటే దగ్గరగా ఉన్నాం అని అమెరికా స్పందించింది. హమాస్ అధిపతి ఇస్మాయిల్ హనియా నుంచి కూడా ఇదే తరహా స్పందన వచ్చింది. ఇజ్రాయెల్‌తో సంధికి దగ్గరవుతున్నాం అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
గాజా వైపు నుంచి హమాస్ రెండు రాకెట్లను ప్రయోగించిందని ఆ రాకెట్లను తమ రక్షణ వ్యవస్థ అడ్డుకుందని ఇజ్రాయెల్ సైన్యం తాజాగా తెలిపింది. ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో ఎయిర్ రైడ్ సైరన్లు వినిపించాయి. మరోపక్క ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. బందీల కుటుంబాలతో మాట్లాడారు. బందీలను విడిపించేంతవరకు తాము వెనక్కి తగ్గబోమని అది ప్రభుత్వ బాధ్యత అన్నారు. వారి విడుదల చాలా ముఖ్యమని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. కాగా.. గాజాలో మానవతా సాయం నిమిత్తం యుద్ధంలో స్వల్ప విరామాల కోసం అంతర్జాతీయ సమాజం చేస్తోన్న ప్రయత్నాలను ఐక్యరాజ్యసమితిలో భారత్ స్వాగతించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ దానిని వ్యతిరేకిస్తుందని తెలిపింది. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి, శాంతియుత పరిస్థితులు నెలకొనే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చింది. అలాగే బందీలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.