గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హార్దిక్ పటేల్

గుజరాత్ లో పటేదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ ని ఆ రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఆయనను ఈ పదవిలో నియమించినట్టు..

  • Publish Date - 10:37 am, Sun, 12 July 20 Edited By: Pardhasaradhi Peri
గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హార్దిక్ పటేల్

గుజరాత్ లో పటేదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ ని ఆ రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఆయనను ఈ పదవిలో నియమించినట్టు ఓ ప్రకటనలో  పేర్కొన్నారు. . 2015 లో పటేదార్ ఉద్యమానికి నేతృత్వం వహించి బీసీలకు కోటా రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించాలంటూ హార్దిక్ పెద్ద ఎత్తున ఆందోళనలు  నిర్వహించారు. 2019 మార్చిలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఓ కేసులో దోషిగా ఉండడంతో ఆ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. 2015 లో గుజరాత్ లో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ, ఆ తరువాత 2017 లో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చారు. దీంతో బీజేపీకి గట్టి పోటీ ఏర్పడింది.