బీహార్ తాళ్లు.. మీరట్ తలారీ.. ఎందుకో తెలుసా..?

నిర్భయ దోషులకు ఢిల్లీలోని పటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 22న ఉదయం 7.00 గంటలకు ఉరి తీయాలంటూ కోర్టుఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష అమలు చేసేందుకు ఢిల్లీలోని తీహార్ జైలు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఉరితీయ డానికి కావలసిన ఉరితాళ్లను, తలారీని ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. ఉరిశిక్షపడ్డ ఖైదీలను ఉరితీసేందుకు తలారీలు లేకపోవడంతో.. ఉరిశిక్ష అమలు గతంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో నిర్భయ […]

బీహార్ తాళ్లు.. మీరట్ తలారీ.. ఎందుకో తెలుసా..?
Follow us

| Edited By:

Updated on: Jan 08, 2020 | 5:54 AM

నిర్భయ దోషులకు ఢిల్లీలోని పటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 22న ఉదయం 7.00 గంటలకు ఉరి తీయాలంటూ కోర్టుఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష అమలు చేసేందుకు ఢిల్లీలోని తీహార్ జైలు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఉరితీయ డానికి కావలసిన ఉరితాళ్లను, తలారీని ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. ఉరిశిక్షపడ్డ ఖైదీలను ఉరితీసేందుకు తలారీలు లేకపోవడంతో.. ఉరిశిక్ష అమలు గతంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో నిర్భయ దోషులను ఉరి తీసేందుకు మీరట్‌కు చెందిన ఓ తలారిని సిద్ధం చేస్తున్నట్లు అధికారులుతెలిపారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇక ఉరి వేసేందుకు తాళ్లను కూడా సమకూర్చినట్లు తెలుస్తోంది. బీహార్‌లోని బక్సర్‌ జైలు నుంచి వీటిని తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే పార్లమెంట్‌పై దాడి జరిపిన కేసులో.. ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురును కూడా ఉరితీసిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా ఉరితీసేందుకు ఈ జైలు నుంచి తీసుకొచ్చిన తాడునే ఉపయోగించారు. ఇప్పుడు కూడా నిర్భయ కేసులో దోషులను ఈ తాళ్లతోనే ఉరివేయబోతున్నారు.