Gyanvapi Masjid Case: రెండ్రోజుల సమయం ఇవ్వండి.. జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి కోర్టును అభ్యర్థించిన కమిషన్‌..

|

May 17, 2022 | 3:46 PM

ఇవాళ కోర్టుకు సమర్పించాల్సి ఉంది. అయితే మంగళవారం పూర్తి స్థాయి రిపోర్టును కోర్టుకు సమర్పించలేమని.. మరో రెండ్రోజుల సమయం కోరింది కమిషన్‌. ఇప్పటివరకు 50శాతం నివేదిక మాత్రమే పూర్తయిందని..

Gyanvapi Masjid Case: రెండ్రోజుల సమయం ఇవ్వండి.. జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి కోర్టును అభ్యర్థించిన కమిషన్‌..
Gyanvapi Mosque Case
Follow us on

ఉత్తరప్రదేశ్‌ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు(Gyanvapi Masjid) వివాదంపై వారణాసి కోర్టులో విచారణ జరుగుతోంది. మూడ్రోజులపాటు చేసిన సర్వే నివేదికను ఇవాళ కోర్టుకు సమర్పించాల్సి ఉంది. అయితే మంగళవారం పూర్తి స్థాయి రిపోర్టును కోర్టుకు సమర్పించలేమని.. మరో రెండ్రోజుల సమయం కోరింది కమిషన్‌. ఇప్పటివరకు 50శాతం నివేదిక మాత్రమే పూర్తయిందని.. పూర్తిస్థాయి రిపోర్ట్‌ సమర్పించేందుకు రెండ్రోజుల సమయం కావాలని కోరింది. దీనిపై కాసేపట్లో నిర్ణయం వెలువరించనుంది కోర్టు. మరోవైపు మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై కాసేపట్లో విచారణ జరపనుంది ఉన్నత న్యాయస్థానం. మసీదు ప్రాంతంలోని బావిలో శివలింగం ఉన్నట్టు హిందూ సంస్థల తరపు న్యాయవాది వెల్లడించారు. శివలింగం లభించిన ప్రాంతాన్ని సీల్‌ చేయాలన్న హిందూ సంస్థల తరపు న్యాయవాది పిటిషన్‌ను అంగీకరించిన కోర్టు.. ఆ ప్రాంతాన్ని సీల్‌ చేయాలని ఆదేశించింది. దీనిపై కోర్టును ఆశ్రయించింది మసీదు కమిటీ.

కోర్టు ఆదేశాలతో మూడ్రోజుల పాటు సర్వే చేసిన అధికారులు..12గంటల వీడియోను రికార్డ్‌ చేశారు. ఐతే మసీదు ప్రాంతంలోని కొలనులో హిందూ సంస్థల తరపు న్యాయవాది చెప్పినట్టు శివలింగం లేదంటున్నారు ముస్లిం సంస్థల తరపు న్యాయవాది.

ఇవి కూడా చదవండి

మరోవైపు మసీదు బావిలో దొరికింది శివలింగం కాదని..ఫౌంటెయిన్‌ అంటున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ. మసీదు ప్రాంతాన్ని సీల్‌ వేయాలని కోర్ట్‌ ఆదేశించడం 1991 యాక్ట్‌ను ఉల్లంఘిండమే అవుతుందంటున్నారు.