Gurugram Apartment Collapse: గురుగ్రామ్‌లో కూలిన అపార్ట్‌మెంట్‌.. ఇద్దరు మృతి,పలువురికి గాయాలు..

|

Feb 10, 2022 | 10:09 PM

ఢిల్లీ శివార్ల లోని గుర్‌గ్రామ్‌లో అపార్ట్‌మెంట్‌ పైకప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా , శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. సెక్టార్‌ 109లో ఉన్న చింతల్స్‌ ప్యారడైజ్‌ అపార్ట్‌మెంట్‌ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలంలో భారీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Gurugram Apartment Collapse: గురుగ్రామ్‌లో కూలిన అపార్ట్‌మెంట్‌.. ఇద్దరు మృతి,పలువురికి గాయాలు..
Gurugram Apartment Collapse
Follow us on

ఢిల్లీ శివార్ల లోని గుర్‌గ్రామ్‌లో అపార్ట్‌మెంట్‌ పైకప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా , శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. సెక్టార్‌ 109లో ఉన్న చింతల్స్‌ ప్యారడైజ్‌ అపార్ట్‌మెంట్‌ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలంలో భారీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను కాపాడేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కొన్ని నెలల క్రితం గురుగ్రామ్‌లో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఖవాస్‌పూర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఫరూఖ్‌నగర్‌లోని పటౌడీ రోడ్డులో భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరిని శిథిలాల నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ భవనం నిజానికి కంపెనీకి చెందిన గిడ్డంగి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికలు ఫిర్యాదు చేశారు. సమయంలో భవనంలో కొంతమంది కూలీలు ఉన్నారని స్థానికులు తెలిపారు.

కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం ప్రకటన

అనంతరం ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. గురుగ్రామ్‌లో ఇల్లు కూలిన ఘటనలో మరణించిన కూలీల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు  సీఎం మనోహర్‌లాల్‌. అదే సమయంలో తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.

కొన్ని నెలల క్రితం, ఢిల్లీలోని సబ్జీ మంచి ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. శిధిలాల కింద ఇద్దరు పిల్లలు మరణించారు. ఢిల్లీలో వర్షాకాలంలో భవనాలు కూలిపోయే సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. రాజధానిలో ఇలా శిథిలావస్థకు చేరిన భవనాలు ఒకటి రెండు కాదు లక్షల్లో ఉన్నాయి. కానీ ఆ భవనం శిథిలావస్థకు చేరుకుందని.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పట్టించుకోలేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది.

ఇవి కూడా చదవండి: Great Khali: ఎన్నికల వేల బీజేపీలో చేరిన మహా బలుడు.. ప్రధాని మోడీపై ది గ్రేట్ ఖలీ ప్రశంసలు…

UP Assembly Election 2022 Phase 1 Polling Live Updates: మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 35.03 శాతం ఓటింగ్‌