Indian parliament: కొత్త పార్లమెంట్ ఆకారంలో ఆభరణాలు.. ఔరా అనిపిస్తున్న మోదీ 3డీ లాకెట్‌..

|

Jun 02, 2023 | 6:27 PM

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన సోనియో అనే ఆభరణాల తయారీ సంస్థ.. కొత్త పార్లమెంట్​ భవన ఆకృతిలో బంగారు చెవి రింగులు, ఉంగరాలను తయారు చేసింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ప్రధాని మోదీ ఫొటోతో డైమండ్ లాకెట్, వెండితో పార్లమెంట్​నమూనాతో పాటు మరికొన్ని ఆభరణాలు...

Indian parliament: కొత్త పార్లమెంట్ ఆకారంలో ఆభరణాలు.. ఔరా అనిపిస్తున్న మోదీ 3డీ లాకెట్‌..
New Parliament Building
Follow us on

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన సోనియో అనే ఆభరణాల తయారీ సంస్థ.. కొత్త పార్లమెంట్​ భవన ఆకృతిలో బంగారు చెవి రింగులు, ఉంగరాలను తయారు చేసింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ప్రధాని మోదీ ఫొటోతో డైమండ్ లాకెట్, వెండితో పార్లమెంట్​నమూనాతో పాటు మరికొన్ని ఆభరణాలు ప్రజలు ఆకర్షిస్తున్నాయి. అంతేకాకుండా చెవిపోగులు, ఉంగరాలు. పెండెంట్‌లను రూపొందించారు.
భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ ఈ ఆభరణాలకు డిమాండ్‌ కనిపిస్తోంది. ప్రధాని మోదీ ఫొటోతో ఉన్న 3డీ ప్రింటింగ్‌ ఆభరణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వ్రజాలతో నిండి ఉన్న ఆ లాకెట్ 2.5 ఇంచెస్‌ ఉంది.

సూరత్‌ జ్యువెలరీ తయారీదారుల సంఘం అధ్యక్షురాలు జయంతి సన్వాలియా ఈ ఆభరణాల గురించి మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వం త్రిభుజాకార రూపంలో కొత్త పార్లమెంట్‌ను నిర్మించింది. ప్రపంచంలోనే భారత్​ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అందుకే ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే కొత్త పార్లమెంట్​ భవన నమూనాను బంగారం, వెండితో భారత ప్రజల కోసమే తయారు చేశాం. కొత్త పార్లమెంట్​ ఆకృతిలో తయారు చేసిన ఉంగరాలు, చెవి రింగుల బరువు 2 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు ఉంటాయ’ని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరో వ్యాపారవేత్త రోహన్​ షా మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ ఇటీవల కొత్త పార్లమెంట్​భవనాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అందుకే పార్లమెంట్​ నమూనాను రూపొందించాలనే ఆలోచన మాకు వచ్చింది. ఈ వెండి పార్లమెంట్​నమూనా.. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ దీన్ని ప్రదర్శించబోతున్నాం. మోదీ డైమండ్​లాకెట్‌కు చాలా డిమాండ్ ఉంద’ని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..