Gujarat minister Ishwarsinh Patel: దేశంలో కరోనావైరస్ ఉధృతి వేగంగా పెరుగుతోంది. సెకండ్ వేవ్ మొదలైన నేపథ్యంలో కరోనా కట్టడికి ఇటు కేంద్రం, అటు రాష్ట్రాలు సైతం కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కరోనా నుంచి కాపాడేందుకు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. అయితే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ పలువురు కరోనా బారిన పడుతుండటం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఇటీవల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న గుజరాత్ క్రీడాశాఖ మంత్రి ఈశ్వర్ సింగ్ పటేల్ సైతం కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఈశ్వర్ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈశ్వర్ సింగ్ అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యం బాగానే ఉందని.. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనావైరస్ పరీక్షలు చేయుంచుకోవాలని ఈశ్వర్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ఈశ్వర్ సింగ్ మార్చి 13న కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినా కూడా అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణకావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలాఉంటే.. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడులలో కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కేసుల తీవ్రత పెరుగుతుండటంతో ఉద్ధవ్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. దీంతోపాటు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 3,29,47,432 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ క్రమంలో బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాల సీఎంలతో భేటీ కానున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులపై ప్రధాని సీఎంలతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.
આજરોજ મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આપ સૌની શુભેચ્છા અને આશીર્વાદથી હાલમાં મારી તબિયત સારી છે.
છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને સાવચેતીના ભાગરૂપે તેમનો કોરોના ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરૂ છું.
— Ishwarsinh T Patel (@patelishwarsinh) March 15, 2021
Also Read: