
తన సోదరి మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుందన్న విషయం తెలుసుకున్న ఒక వ్యక్తి బ్లాక్ మెయిల్ చేసి ఆమెపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడిన గటన గుజరాత్ రాష్ట్రంలోని భవానీనగర్‌లో వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. భవానీనగర్‌కు చెందిన ఒక వ్యక్తి స్థానికంగా డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి 22 ఏళ్ల సోదరి కూడా ఉంది. అయితే తన సోదరికి తమ గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో ప్రేమాయనం నడిపిస్తున్నట్టు అతను తెలుసుకున్నాడు. వారిద్దరూ మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నట్టు గుర్తించాడు. మొదట అతనితో సంబంధం మానుకోమని ఆమెను బెదిరించాడు.
ఆ తర్వాత ఆదే విషయాన్ని అదునుగా చేసుకొని ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి తన సోదరిపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. జూలై 13న మొదటి సారి ఈ దారుణానికి పాల్పడ్డాడు.ఆ రోజు నిందితుడి భార్య తన తల్లిదండ్రులను చూడటానికి వెళ్ళినప్పుడు అతను తన సోదరిని కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. రెండవ సంఘటన ఆగస్టు 22న అతని భార్య వ్యక్తిగత పని కోసం బయటకు వెళ్ళినప్పుడు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. రెండు సందర్భాలలోనూ బాధితురాలు ఇంట్లో ఒంటరిగానే ఉందని పోలీసులు తెలిపారు.
అయితే రెండవ సంఘటన తర్వాత ఆ మహిళ తనపై జరిగిన దాడులను పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలనుకుంది. వెంటనే రాష్ట్ర మహిళా హెల్ప్‌లైన్‌ను సంప్రదించి తనపై జరిగిన వేధింపులను ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు ఘటనపై భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే రెండవ దాడి సమయంలో, నిందితుడు ఆమె కుడి తొడపై వెలిగించిన సిగరెట్‌ను గుచ్చాడని, దానితో తన తొడపై కాలిన గాయాలు అయ్యాయని బాధితురాలు ఆరోపించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.దాడుల సమయంలో ఉపయోగించిన కత్తి, నిందితులు ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఆ తర్వాత బాధితురాలికి, నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.