Narendra Modi: ప్రధాని మోడీ విద్యార్హతల కేసు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్‌ ఇచ్చిన హైకోర్టు

|

Mar 31, 2023 | 5:51 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విద్యార్హతల కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు షాక్‌ తగిలింది. ఈ కేసును విచారించిన గుజరాత్ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. మోడీకి సంబంధించిన డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికెట్లను పీఎంవో బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని..

Narendra Modi: ప్రధాని మోడీ విద్యార్హతల కేసు.. ఢిల్లీ  సీఎం కేజ్రీవాల్‌కు షాక్‌ ఇచ్చిన హైకోర్టు
Pm Modi, Kejriwal
Follow us on

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విద్యార్హతల కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు షాక్‌ తగిలింది. ఈ కేసును విచారించిన గుజరాత్ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. మోడీకి సంబంధించిన డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికెట్లను పీఎంవో బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంతేగాక, ఈ వివరాలు అడుగుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రూ.25,000 జరిమానా విధించింది. గుజ‌రాత్ యూనివ‌ర్సిటీతో పాటు ఢిల్లీ యూనివ‌ర్సిటీలు ప్ర‌ధాని మోదీ డిగ్రీ, పీజీ స‌ర్టిఫికేట్లను స‌మ‌ర్పించాల‌ని చీఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ క‌మిష‌న్ ఇచ్చిన ఆదేశాల‌ను జస్టిస్ బీరెన్ వైష్ణవ్ తో కూడిన సింగిల్ జ‌డ్జి బెంచ్ కొట్టిపారేసింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు రూ. 25,000 జరిమానా విధించిన హైకోర్టు ఆ మొత్తాన్ని గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. కాగా ప్రధానమంత్రి డిగ్రీని చూపించాలంటూ కేంద్ర సమాచార కమిషన్‌ ఆదేశాలకు వ్యతిరేకంగా గుజరాత్‌ యూనివర్సిటీ తరఫున హైకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆయన 1978లో గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆపై 1983లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకున్నారు.

అయితే మోడీ నిజంగానే డిగ్రీ, పీజీ డిగ్రీ చదివారా? అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చాలా కాలంగా నిలదీస్తున్నారు. మోడీ అంత చదువుకున్నది నిజమైతే అందుకు సంబంధించిన ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మోడీ విద్యార్హతలకు సంబంధించి ఆధారాలు చూపాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా హైకోర్టు తీర్పుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. తమ ప్రధాని ఎంత విద్యావంతుడో తెలుసుకునే హక్కు కూడా దేశానికి లేదంటూ ట్విట్టర్‌ వేదికగా తమ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిరక్షరాస్యులైన లేదా తక్కువ చదువుకున్న ప్రధానులు దేశానికి చాలా ప్రమాదకరమని అందులో హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ కథనాల కోసం క్లిక్ చేయండి..