Gujarat CM Resigns: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సంచలన నిర్ణయం.. సీఎంగా రాజీనామా

Vijay Rupani resigned: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సంచలన నిర్ణయం.. సీఎం పదవికి రాజీనామా సమర్పించారు.

Gujarat CM Resigns: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సంచలన నిర్ణయం.. సీఎంగా రాజీనామా
Gujarat Cm Vijay Rupani
Follow us

|

Updated on: Sep 11, 2021 | 4:04 PM

Gujarat CM Vijay Rupani resigns: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సంచలన నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. సీఎం పదవికి రాజీనామా చేశారు. ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా పని చేసిన విజయ్ రూపానీ.. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మిగిలి ఉండగానే పదవిని వదులుకున్నారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు.

గుజరాత్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ.. సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌కు రాజీనామా సమర్పించారు. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అయితే, రాజీనామాకు గల కారణాలు తెలియరాలేదు. 2016 ఆగస్టు 7న రూపానీ.. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం అయ్యిన గుజరాత్‌లో ఐదేళ్లుగా ఆయన బాధ్యతలు నిర్వహించారు.

గాంధీనగర్‌లో జరిగిన పార్టీ కీలక సమావేశం తర్వాత గుజరాత్‌లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాజీనామా చేశారు. తన రాజీనామా సమర్పించిన తరువాత, రూపానీ విలేకరులతో మాట్లాడుతూ.. తనకు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అతను తన ఆకస్మిక రాజీనామా వెనుక గల కారణాల గురించి ప్రశ్నలను సమాధానం దాటవేశారు.

తాను ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశానని, అది చాలా కాలం అని చెప్పాడు. బీజేపీలో మార్పు అనేది సహజమైనన్న రూపానీ తెలిపారు. తాను బీజేపీ జాతీయ అధ్యక్షుడి నాయకత్వంలో పని చేస్తూనే ఉంటానని చెప్పారు. గత ఐదేళ్ల కాలంలో ప్రజలు బీజేపీపై తమ విశ్వాసాన్ని పదేపదే నిలబెట్టుకున్నారని ఆయన అన్నారు. ఇటీవలి వారాల్లో రాజీనామా చేసిన మూడో బీజేపీ సీఎం రూపానీ. అంతకుముందు, కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తిరత్ సింగ్ రావత్ కూడా సీఎం పదవుల నుంచి తప్పుకున్నారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేవ‌లం ఏడాది గ‌డువు ఉండ‌గా ముందస్తుగా విజ‌య్ రూపానీ రాజీనామా చేయ‌డం ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారింది. బీజేపీ కొత్త ముఖ్యమంత్రి నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

మరోవైపు, విజ‌య్ రూపానీ గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల ఒక స‌భ‌లో ప్రసంగిస్తూనే ఆయ‌న కుప్పకూలిపోయారు. మ‌రో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉండ‌టం, విజ‌య్ రూపానీ ఆరోగ్య ప‌రిస్థితి స‌రిగా లేక‌పోవ‌డం లాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని నియ‌మించి.. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నేది బీజేపీ వ్యుహంగా రాజకీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. Read Also…Funny Video: భార్య చెప్పే పనులు చేయలేక ఈ తుంటరి భర్త ఏం చేశాడంటే..! వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్‏లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న అందాల యాంకరమ్మ.. ఇక అసలైన రచ్చ అప్పుడే..

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!