Green fungus: మ‌రో టెన్ష‌న్.. దేశంలో తొలిసారిగా గ్రీన్‌ ఫంగస్‌ కేసు నమోదు

|

Jun 16, 2021 | 1:20 PM

క‌రోనా​ నుంచి కోలుకున్నవారిని ఫంగ‌స్ టెన్ష‌న్ వెంటాడుతున్న విష‌యం తెలిసిందే. బ్లాక్​, వైట్​, ఎల్లో, క్రీమ్ ఫంగస్ కేసులు ఇప్ప‌టివ‌ర‌కు ​ వెలుగుచూశాయి.

Green fungus: మ‌రో టెన్ష‌న్.. దేశంలో తొలిసారిగా గ్రీన్‌ ఫంగస్‌ కేసు నమోదు
Green Fungus
Follow us on

క‌రోనా​ నుంచి కోలుకున్నవారిని ఫంగ‌స్ టెన్ష‌న్ వెంటాడుతున్న విష‌యం తెలిసిందే. బ్లాక్​, వైట్​, ఎల్లో, క్రీమ్ ఫంగస్ కేసులు ఇప్ప‌టివ‌ర‌కు ​ వెలుగుచూశాయి. కొత్తగా మధ్యప్రదేశ్​ ఇండోర్​లో ఓ వ్యక్తి గ్రీన్​ ఫంగస్ బారిన ప‌డ్డ‌ట్లు అధికారులు గుర్తించారు. అయితే.. ఈ వైరస్​ ప్రభావం రోగులపై ఎంతగా ఉందనేది తెలియాల్సి ఉంది. ఇటీవలే క‌రోనా​ నుంచి కోలుకున్న 34 ఏళ్ల వ్యక్తికి గ్రీన్ ఫంగస్​ సోకినట్లు నిర్ధరించారు శ్రీ అరబిందో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్లు. రోగిని ముంబై ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. తొలుత బ్లాక్​ ఫంగస్​ సోకిందని టెస్టులు చేయ‌గా రోగికి గ్రీన్​ ఫంగస్​ సోకినట్లు తేలిందని డాక్టర్. రవి దోసి వివ‌రించారు. అయితే.. ఈ ఫంగస్​పై మరింత అధ్యయనం చేయడం అవసరమని ఆయన అన్నారు. క‌రోనా​ నుంచి కోలుకున్నప్పటికీ.. రోగిలో అధిక జ్వరం, ముక్కులోంచి రక్తం వంటి లక్షణాలు కనిపించాయని దోసి వివరించారు.

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు వ్యక్తి సుమారు ఒకటిన్నర నెలల క్రితం నుంచి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఊపిరితిత్తుల్లో చీము నిండి ఉందని, దాన్ని తొలగించేందుకు చాలా ప్రయత్నాలు చేసినా విజయవంతం కాలేదని వెల్ల‌డించారు. చికిత్స సమయంలో, రోగిలో వివిధ రకాల సింట‌మ్స్ గమనించామని, అదే సమయంలో అతనికి జ్వరం 103 డిగ్రీల కంటే దిగువకు చేరలేదని డాక్ట‌ర్లు తెలిపారు. గ్రీన్‌ ఫంగస్‌ ఊపిరితిత్తులకు వేగంగా సోకుతోందని, దీనిపై మరింత లోతైన ప‌రిశోధ‌న‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read: వైయ‌స్ ష‌ర్మిల హుజూర్‌నగర్ ప‌ర్య‌ట‌న‌లో ఊహించ‌ని ట్విస్ట్.. నిరుద్యోగి ఆచూకీ మిస్సింగ్

పాపం పసిపాప..గంగా నదిలో చెక్క పెట్టెలో పెట్టి వదిలేశారు.. తర్వాత ఏమైందంటే..