Modi Cabinet: చమురు సంస్థలకు 22వేల కోట్ల గ్రాంట్‌.. రైల్వే ఉద్యోగులకు బోనస్‌.. కేంద్ర కేబినేట్‌ కీలక నిర్ణయాలివే

|

Oct 12, 2022 | 9:12 PM

ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు 22 వేల కోట్ల రూపాయలు వన్‌ టైమ్ గ్రాంట్‌ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌పీ‌జీ ధరలు పెరుగుతున్న కారణంగా సామాన్యులపై ఆ ప్రభావం పడకుండా పబ్లిక్ సెక్టార్‌లోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 22 వేల కోట్ల రూపాయలు వన్‌న్ టైమ్ గ్రాంట్‌గా ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.

Modi Cabinet: చమురు సంస్థలకు 22వేల కోట్ల గ్రాంట్‌.. రైల్వే ఉద్యోగులకు బోనస్‌.. కేంద్ర కేబినేట్‌ కీలక నిర్ణయాలివే
Anurag Thakur
Follow us on

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పనితీరు ఆధారిత బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందు కోసం మొత్తం 1,832 కోట్ల రూపాయలు కేటాయించారు. 11.27 లక్షల మందికి దీంతో లబ్ధి చేకూరుతుంది. కాగా ప్రయాణికులు, వస్తు రవాణా సేవలందించడంలో రైల్వే ఉద్యోగులు కీలక పాత్ర పోషించి ఆర్థిక వ్యవస్థకు ఉత్ప్రేరకంగా పనిచేశారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌ ప్రశంసించారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ ఆహారం, ఎరువులు, బొగ్గు, ఇతర నిత్యావసర వస్తువులను నిరంతరాయంగా తరలించేందుకు సహకరించారన్నారు. అలాగే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు 22 వేల కోట్ల రూపాయలు వన్‌ టైమ్ గ్రాంట్‌ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌పీ‌జీ ధరలు పెరుగుతున్న కారణంగా సామాన్యులపై ఆ ప్రభావం పడకుండా పబ్లిక్ సెక్టార్‌లోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 22 వేల కోట్ల రూపాయలు వన్‌న్ టైమ్ గ్రాంట్‌గా ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.

అలాగే ప్రైమ్ మినిస్టర్ డెవెలప్‌మెంట్ ఇనీషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్ అనే కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2022-23 నుంచి 2025-26 వరకూ 15వ ఆర్థిక కమిషన్ ప్రకారం ఈ కొత్త పథకం అమలవుతుందని సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. ప్రజలపై గ్యాస్‌ భారం ఎట్టి పరిస్థితుల్లో పడకూడదనేదే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. అలాగే మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002ను సవరిస్తూ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2022కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గుజరాత్‌లో దీన్‌దయాల్‌ పోర్ట్‌ విస్తరణకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..