రేపే కుమారస్వామి సర్కార్‌కు బలపరీక్ష

కర్నాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షపై ఒక్కరోజు గండాన్ని తప్పించుకున్నారు సీఎం కుమారస్వామి. బలపరీక్షపై ఎటూ తేల్చకుండానే స్పీకర్ రమేష్ కుమార్ సభను రేపటికి వాయిదా వేశారు. స్పీకర్ తీరుకు నిరసనగా బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. బలపరీక్షపై స్పీకర్ కావాలనే జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రంతా సభలోనే బైఠాయిస్తామని బీజేపీ పక్ష నేత యడ్యూరప్ప స్పష్టం చేశారు. రాత్రంతా బీజేపీ ఎమ్మెల్యేలు సభలో ఉంటారని ఆయన తేల్చిచెప్పారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం తమ హోటల్ […]

రేపే కుమారస్వామి సర్కార్‌కు బలపరీక్ష
Follow us

| Edited By:

Updated on: Jul 18, 2019 | 9:20 PM

కర్నాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షపై ఒక్కరోజు గండాన్ని తప్పించుకున్నారు సీఎం కుమారస్వామి. బలపరీక్షపై ఎటూ తేల్చకుండానే స్పీకర్ రమేష్ కుమార్ సభను రేపటికి వాయిదా వేశారు. స్పీకర్ తీరుకు నిరసనగా బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. బలపరీక్షపై స్పీకర్ కావాలనే జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రంతా సభలోనే బైఠాయిస్తామని బీజేపీ పక్ష నేత యడ్యూరప్ప స్పష్టం చేశారు. రాత్రంతా బీజేపీ ఎమ్మెల్యేలు సభలో ఉంటారని ఆయన తేల్చిచెప్పారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం తమ హోటల్ గదులకు వెళ్లిపోయారు. మరోవైపు రెబెల్స్‌ను బుజ్జగించడానికి కాంగ్రెస్ నేతలు తుది ప్రయత్నాలు చేస్తున్నారు. ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేత సిద్ధరామయ్యకు టచ్‌లోకి వచ్చారు. మరో వారం రోజుల వరకు సంక్షోభాన్ని పొడిగించాలన్న ఆలోచన కాంగ్రెస్ నేతలకు ఉంది. అయితే శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలలోగా బలనిరూపణ పూర్తి కావాలని గవర్నర్ సీఎం కుమారస్వామికి లేఖ రాశారు. దీంతో రేపు మధ్యాహ్నం కుమారస్వామి బలపరీక్ష ఎదుర్కోనున్నారు.