Aadhaar-voter ID linking: పార్లమెంట్‌ ముందుకు కీలక బిల్లు.. వ్యతిరేకించిన ఎంఐఎం.. ఎందుకంటే..

పార్లమెంట్‌ ముందుకు కీలక బిల్లు..ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకతకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో విప్లవాత్మక సంస్కరణకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్‌కు మరిన్ని అధికారాలు..

Aadhaar-voter ID linking: పార్లమెంట్‌ ముందుకు కీలక బిల్లు.. వ్యతిరేకించిన ఎంఐఎం.. ఎందుకంటే..
Lok Sabha

Updated on: Dec 20, 2021 | 2:18 PM

పార్లమెంట్‌ ముందుకు కీలక బిల్లు..ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకతకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో విప్లవాత్మక సంస్కరణకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్‌కు మరిన్ని అధికారాలు కల్పించేలా కొత్త బిల్లును తీసుకొచ్చింది. అదే ఆధార్‌తో ఓటర్‌ ఐడీ అనుసంధానం.  ఓటర్‌ లిస్టులో డూప్లికేషన్‌ను అరికట్టే దిశగా కేంద్రం కీలక ముందడుగు వేసింది. ఎన్నికల చట్టాల సవరణ బిల్లును పార్లమెంట్‌ ముందుకు తీసుకొచ్చింది. ఆధార్‌తో ఓటర్‌ ఐడీని అనుసంధానం చేసే బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ద్వారా కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్​ను కోరనుంది ఎన్నికల కమిషన్​. దీంతో పాటు ఇప్పటికే ఓటు హక్కు ఉన్న వారి నుంచి కూడా ఆధార్​ సేకరించేందుకు వీలుంటుంది.

అయితే వ్యక్తిగత గోప్యతను దృష్టిలో ఉంచుకుని.. ఆధార్-ఓటర్ ఐడీ లింక్ తప్పనిసరి ప్రాతిపదికన కాకుండా.. ఐచ్చికంగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉంటే తొలగించేలా చర్యలు చేపట్టింది. ఆధార్‌తో ఓటర్‌ ఐడీ అనుసంధానం బిల్లు లోక్‌సభ ముందుకొచ్చింది. అయితే ఈ బిల్లును MIM వ్యతిరేకించింది.

ఇవి కూడా చదవండి: Byreddy Siddharth Reddy: బైరెడ్డా.. మజాకా.. సీఎంకు బర్త్ డే విషెస్ ఎలా చెప్పాడో చూడండి

Viral Video: ఎలక్ట్రిక్ ఈల్‌ను వేటాడాలనుకున్న మొసలి.. షాకింగ్.. ఊహించని విషాదాంతం..