
Google Kannada Controversy: గూగుల్.. ప్రపంచంలో దేని గురించైనా క్షణాల్లో మన ముందు ఉంచుతుంది. ప్రతి ప్రశ్నకు గూగుల్ దగ్గర సమాధానం ఉంటుంది. పొరపాట్లు సహజం. అలాగే కొన్ని సార్లు గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో పొరపాట్లు జరుగుతుంటాయి. ప్రశ్న ఒకటైతే.. సమాధానం చిత్ర విచిత్రంగా ఉంటుంది. ఇలాంటి పొరపాట్లు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో సాధారణంగా మారిపోయాయి. ప్రస్తుతం అన్నిభాషల్లోకి గూగుల్‌ను విస్తరించిన తరువాత తర్జుమా (ట్రాన్స్ లేషన్) విషయంలో విపరీతమైన పొరపాట్లు తలెత్తుతున్నాయి. ఇక సెర్చ్ ఇంజన్ కూడా ఒక్కోసారి రకరకాలుగా ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా జవాబులు చూపిస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా కన్నడ భాష పై గూగుల్ చెప్పిన సమాధానం అక్కడి ప్రజలకు తీవ్ర కోపం తెప్పించిన సంగతి తెలిసిందే.
ఇటీవల భారతదేశంలో అగ్లీయస్ట్ భాష ఏది అని గూగుల్ సెర్చ్ ఇంజిన్లో వెతికితే.. సమాధానం ”కన్నడ” అని వచ్చింది, దక్షిణ భారతదేశంలో సుమారు 40 మిలియన్ల మంది మాట్లాడే భాష” అని చూపించిన సంగతి తెలిసిందే. దీనిపై కన్నడ ప్రజల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో గూగుల్ దౌర్జన్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గూగుల్ క్షమపణ చెప్పాలని.. దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి వారు డిమాండ్ చేయడంతో గూగుల్ దిగొచ్చింది. కన్నడ ప్రజలకు క్షమపణలు తెలిపింది. సెర్చ్ ఇంజిన్ లో పొరపాటు జరిగింది. ఇది కావాలని చేసిన పని కాదు.. సెర్చ్ ఇంజిన్ లో జరిగిన పొరపాట్లను వెంటనే సరిచేస్తాం.. మీ మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమపణలు కోరుతున్నాం అంటూ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేసింది.
ట్వీట్..
We apologize for the misunderstanding and hurting any sentiments. pic.twitter.com/nltsVezdLQ
— Google India (@GoogleIndia) June 3, 2021