AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లుడి చేరికపై అత్తల రియాక్షన్ ఇదే..

కాంగ్రెస్ పార్టీ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కమలం గూటికి చేరడంపై.. రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ నాయకురాలు వసుంధర రాజే స్పందించారు. సింధియా బీజేపీలోకి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సింధియా స్వభావం, బలం, ధైర్యాన్ని ఎప్పుడూ గౌరవిస్తానని రాజే తెలిపారు. బుధవారం జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. కాగా.. జ్యోతిరాధిత్య సింధియాకు వసుంధర రాజే స్వయానా మేనత్త అవుతుందన్న విషయం తెలిసిందే. సింధియా […]

అల్లుడి చేరికపై అత్తల రియాక్షన్ ఇదే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 12, 2020 | 4:51 PM

Share

కాంగ్రెస్ పార్టీ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కమలం గూటికి చేరడంపై.. రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ నాయకురాలు వసుంధర రాజే స్పందించారు. సింధియా బీజేపీలోకి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సింధియా స్వభావం, బలం, ధైర్యాన్ని ఎప్పుడూ గౌరవిస్తానని రాజే తెలిపారు. బుధవారం జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.

కాగా.. జ్యోతిరాధిత్య సింధియాకు వసుంధర రాజే స్వయానా మేనత్త అవుతుందన్న విషయం తెలిసిందే. సింధియా బీజేపీ చేరిన ఈ సమయంలో మా అమ్మ (రాజమాత విజయ రాజే సింధియా ) ఉంటే ఎంతో గర్వించేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఇద్దరం ఒకే పార్టీలో ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మరో మేనత్త, మధ్యప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే యశోధర రాజే కూడి సింధియా చేరికపై సంతోషం వ్యక్తం చేశారు. మహారాజ్‌కు స్వాగతం అంటూ సింధియాకు వెల్‌కమ్ చెప్పారు.