Vaishno Devi Darshan: వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో శుభవార్త..! అదేంటంటే..

|

Nov 19, 2024 | 9:10 AM

ఈ ప్రాజెక్ట్‌ అమల్లోకి వస్తే ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించే భక్తుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. కాగా, గత సంవత్సరం మాతా వైష్ణో దేవి దర్శనార్థం 95 లక్షల మంది యాత్రికులతో కొత్త రికార్డును సృష్టించిందని చెప్పారు.

Vaishno Devi Darshan: వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో శుభవార్త..! అదేంటంటే..
Vaishno Devi Darshan
Follow us on

మాతా వైష్ణో దేవి భక్తులకు శుభవార్త. శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డ్ యాత్రికుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, సులభంగా చేయడానికి మార్గం సుగమం చేసింది. చాలా కాలంగా భక్తులు ఎదురుచూస్తున్న రోప్‌వే ప్రాజెక్ట్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జమ్మూలోని శ్రీమాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర ఆలయానికి వెళ్లేందుకు వీలుగా తలపెట్టిన రోప్ వే నిర్మాణ పనుల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. పనులు పూర్తయితే భక్తులు వేగంగా, సులభంగా వైష్ణోదేవీ ఆలయానికి చేరుకునేందుకు అవకాశం ఉంటుందని బోర్డు సీఈవో అన్షుల్ గార్గ్ కాట్రాలో మీడియాకు వెల్లడించారు.

ఈ మేరకు బోర్డు CEO అన్షుల్ గార్గ్ మాట్లాడుతూ,..రోప్‌వే ప్రాజెక్ట్ భక్తులకు ఎంతో సంతోషాన్నిస్తుందని చెప్పారు. ముఖ్యంగా యాత్రికులు ఆలయానికి చేరుకోవాలంటే నిటారుగా 13 కిలోమీటర్ల ఎటవాలును సవాలుగా భావిస్తారు. కానీ, రోప్‌వే ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే భక్తులకు ఊరట లభిస్తుందన్నారు. గంటల తరబడి సాగే ప్రయాణంతో పోలిస్తే ఈ ప్రయాణం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఉంటుందని అధికారులు తెలిపారు.

రోప్‌వే ప్రాజెక్ట్‌ అమల్లోకి వస్తే ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించే భక్తుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. కాగా, గత సంవత్సరం మాతా వైష్ణో దేవి దర్శనార్థం 95 లక్షల మంది యాత్రికులతో కొత్త రికార్డును సృష్టించిందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..