PM KISAN Yojana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. పీఎం కిసాన్‌ పథకంలో చేరేందుకు చివరి తేదీ ఎప్పుడంటే..!

| Edited By: Team Veegam

May 29, 2021 | 7:23 PM

PM KISAN Yojana: కరోనా వ్యాప్తి సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు పెద్ద అవకాశం కల్పించింది. అన్నదాతలు రూ.4 వేలు పొందే అవకాశం ఒకటి అందుబాటులోకి వచ్చింది.

PM KISAN Yojana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. పీఎం కిసాన్‌ పథకంలో చేరేందుకు చివరి తేదీ ఎప్పుడంటే..!
Pm Kisan
Follow us on

కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. అన్నదాతలు రూ.4 వేలు పొందే అవకాశం ఒకటి అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం పీఎం కిసాన్ స్కీమ్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో చేరిన వారికి ఏడాదికి రూ.6 వేలు అందిస్తారు. అయితే ఇవి ఒకేసారి కాకుండా విడతల వారీగా వస్తుంటాయి. మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమవుతాయి. ఇప్పటికే పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరిన వారికి ఈ డబ్బులు వస్తోంది. అయితే ఇంకా ఈ పథకంలో చేరని వారు ఉంటే.. వారు వెంటవెంటనే రూ.4 వేలు పొందే అవకాశం ఒకటి అందుబాటులో ఉంది.

పీఎం కిసాన్ పథకంలో చేరడానికి జూన్ 30లోపు చేరితే వారికి ఈ ప్రయోజనం లభిస్తుంది. ఏప్రిల్- జూలై ఇన్‌స్టాల్‌మెంట్ జూలై నెలలో వస్తుంది. అలాగే తర్వాత ఆగస్ట్ నెల ఇన్‌స్టాల్‌మెంట్ కూడా పొందొచ్చు. అంటే వరుసగా రెండు ఇన్‌స్టాల్‌మెంట్లు వెంటది వెంటనే మీ ఖాతాలో పీఎం కిసాన్ డబ్బులు జమ కానున్నాయి.

ఇదిలావుంటే… మీరు పీఎం కిసాన్ పథకంలో చేరడానికి ఎక్కడికీ వెళ్లక్కర్లేదు. ఆన్‌లైన్‌లోనే ఇవి పూర్తి చేయవచ్చు. మీరు మీ ఇంట్లో కూర్చొని ఈ పథకంలో చేరొచ్చు. దీనికోసం  మీరు ముందుగా…  పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి వెబ్: Register here:  https://pmkisan.gov.in/. అక్కడి నుంచి స్కీమ్‌లో చేరాలి. బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, పొలం పాస్‌బుక్ వంటివి కావాలి.

Read Also: బ్లాక్ ఫంగస్‌కు అదే కారణమా? అనుమానం వ్యక్తంచేస్తున్న వైద్య నిపుణులు

 గాలిలో ఎగురుతూన్న డేగపై చేప దాడి చేసింది… ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు…

 కోవిడ్-19తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం కేంద్రం కొత్త పథకం.. పీఎం కేర్స్​ నుంచి రూ.10 లక్షలు.. ఇంకా

రాష్ట్రాలకు రెమిడెసివిర్ మందును నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వం….రాష్ట్రాలే కొనుగోలు చేసుకోవాలని ఉత్తర్వులు