Viral News: ‘గోల్డెన్ కపుల్’.. ఒంటిపై మాత్రమే కాదు, ఆ దంపతుల చెప్పులకు, సెల్‌ఫోన్లకు కూడా బంగారమే

|

Jul 08, 2021 | 6:58 PM

ఒకప్పుడు బండిపై కూరగాయలమ్మారు.. అదే ఇప్పుడూ.. ఒంటి పై కిలోల కొద్దీ బంగారు నగలు దిగేసుకుంటున్నారు.. కూరగాయల అమ్మకంలో ఇంత లాభముందా? అని ఆశ్చర్యమేస్తుంది..

Viral News: గోల్డెన్ కపుల్.. ఒంటిపై మాత్రమే కాదు, ఆ దంపతుల చెప్పులకు, సెల్‌ఫోన్లకు కూడా బంగారమే
Rajastan Golden Couple
Follow us on

బతకలేక బడిపంతులంటారు. ఇప్పుడా మాట ఎవ్వరూ ఒప్పుకోరు.  ఇప్పుడు బతకలేక కూరగాయల దుకాణం అంటున్నారు. ఈ దంపతులను చూస్తే ఆ మాట కూడా ఎవ్వరూ ఒప్పుకోరు. కారణం.. వీళ్లు అమ్మేది కూరగాయలా లేక మణి- మాణిక్యాలా? ఆశ్చర్యమేస్తుంది.. ఎందుకంటే ఈ భార్యాభర్తల ఒంటిపై కిలోల కొద్దీ బంగారముంటుంది. ఒకప్పుడు బండిపై కూరగాయలమ్మారు.. వారే ఇప్పుడు.. ఒంటిపై కిలోల కొద్దీ బంగారు నగలు దిగేసుకుంటున్నారు. కూరగాయల అమ్మకంలో ఇంత లాభముందా? అని ఆశ్చర్యమేస్తుంది.. ఈ గోల్డెన్ పెయిర్ ని చూస్తే. ఈ ఇద్దరూ రాజస్థాన్ లోని చిత్తోర్ గఢ్ కు చెందిన కన్హయ్యా లాల్, గీతాదేవి దంపతులు. ఇరవై ఏళ్ల క్రితం వీరు చిత్తోర్ గర్ రోడ్డు పక్కన బండి మీద పండ్లూ- కూరగాయలను అమ్మేవారు.  వ్యాపారంలో మెళకువలు నేర్చుకున్న ఈ జంట.. ఆపిల్ డస్ట్రిబ్యూటర్స్ గా ఎదిగారు. దీంతో సంపాదన బాగా పెరిగింది. అక్కడి నుంచీ వీరికో టేస్ట్ ఏర్పడింది. అదే గోల్డెన్ కలెక్షన్ టేస్ట్. వచ్చిన డబ్బు వచ్చినట్టు బంగారం కొనేసేవాళ్లు. అలా మొదలైన వీరి గోల్డెన్ కలెక్షన్ ఇప్పుడు ఒకటీ రెండు కాదు ఏకంగా 6 కిలోలకు చేరింది. కన్నయ్య ఒంటిపై ఎప్పుడూ మూడున్నర కిలోల బంగారముంటుంది. నగలు మాత్రమే కాదు అతడి మొబైల్, ఆఖరున చెప్పులు కూడా గోల్డే.

Gold Man

కన్నయ్యను చిత్తోర్ గఢ్ బప్పిలహరి అంటారు. ఇద్దరం ఒకేలా ఉంటామన్న ఆలోచనతో ఒక సారి కన్నయ్య, బప్పిలహరిని కూడా కలిశాడు. తనలా ఉండే ఈ గోల్డెన్ మేన్ను చూసిన బప్పిలహరి కూడా ఆశ్చర్య పోయారు.  కన్నయ్య మాత్రమే కాదు, ఆయన భార్య గీతాదేవి.. సైతం.. మూడు కిలోల బంగారంతో తళతళమెరిసిపోతూ కనిపిస్తారు. ఈమె ఒంటిపై బంగారం ఎవరైనా దొంగలొచ్చి దోచుకుపోతే.. అన్న అనుమానమొచ్చింది. దీంతో కన్నయ్య తన భార్యకు లైసెన్స్డ్ రివాల్వర్ సైతం తీసిచ్చారు. అద్దీ ఈ గోల్డెన్ వైఫ్ అండ్ హజ్బండ్ గోల్డెన్ స్టోరీ.. వింతేంటంటే.. వీరి నగల ధగధగలు చూసి షాకయ్యే కొందరు సెల్ఫీలు సైతం దిగుతుంటారు.

Also Read: ప్రమాదంలో గాయపడిన బాలుడికి .. బిగిల్ మూవీ చూపించి ఆపరేషన్ చేసిన వైద్యులు

బండి బయటకు తీయాలంటే గుండె గుబేలుమంటుంది.. పక్క దేశాల్లో 60కే దొరుకుతున్న పెట్రోల్‌ మన దగ్గర 100 దాటి ఎందుకు పోతుంది?