AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళ నుంచి గొర్రెలు కొనేందుకు వచ్చి, ఛీ.. ఎలాంటి పని చేశాడంటే..?

కర్ణాటకలోని కొడూరు తాలూకా నిధఘట్ట గ్రామానికి చెందిన హేమావతి అనే గొర్రెల పెంపకందారురాలు తన గొర్రెలను అమ్మి 25,000 రూపాయలు నకిలీ నోట్ల రూపంలో అందుకుంది. బ్యాంకులో డిపాజిట్ చేసేటప్పుడు ఈ మోసం బయటపడింది. ఈ ఘటనతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగించే వారికి ఇది పెద్ద దెబ్బ.

మహిళ నుంచి గొర్రెలు కొనేందుకు వచ్చి, ఛీ.. ఎలాంటి పని చేశాడంటే..?
Karnataka Case
SN Pasha
|

Updated on: Apr 18, 2025 | 5:39 PM

Share

చాలా మంది గొర్రెల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతుంటారు. జీవాలను ఎంతో కష్టపడి సాది, వాటిని అమ్ముకొని.. ఆ డబ్బుతోనే జీవనం సాగిస్తుంటారు. అదేవిధంగా కదూర్ తాలూకాలోని నిధఘట్ట గ్రామానికి చెందిన ఒక మహిళ గొర్రెలను పెంచుకుంటూ దాని ద్వారా వచ్చే లాభాలతో జీవనోపాధి పొందుతోంది. అయితే, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆ మహిళ నుంచి గొర్రెలను కొని, నకిలీ డబ్బులు ఇచ్చి పారిపోయాడు.

ఉత్తర కన్నడ జిల్లా అడుగుజాడల్లోనే, చిక్కమగళూరు జిల్లాలోని ప్రజల చేతుల్లో కూడా నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయి. కదూర్ తాలూకాలోని నిడఘట్ట గ్రామానికి చెందిన హేమావతి నుండి గుర్తు తెలియని వ్యక్తులు గొర్రెలను కొనుగోలు చేసి ఆమెకు నకిలీ నోట్లను ఇచ్చాడు. హేమావతి గొర్రెలను అమ్మడం ద్వారా సంపాదించిన డబ్బును తన బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి వెళ్ళినప్పుడు, ఆ నోట్లు నకిలీ నోట్లని బ్యాంకు అధికారులు తెలిపారు. దాంతో ఆమె ఒక్కసారిగా షాక్‌ అయింది.

హేమావతి గొర్రెలను రూ.25 వేల అమ్మేసింది. హేమావతి ఈ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్లగా అసలు మోసం బయటపడింది. ఈ 25,000 రూపాయలలో 14,000 రూపాయల నోట్లు నకిలీవి. ఐదు వందల రుపాయల 28 నోట్లు నకిలీవని బ్యాంకు సిబ్బంది ఆ మహిళకు చెప్పారు. పాపం.. కాయకష్టం చేసుకుంటూ.. బతుకుబండి లాగేందుకు ఆమె ఎంతో కష్టపడి జీవాలను పెంచుతుంటే.. ఎవడో ఈ విధంగా మోసం చేయడంతో స్థానికులు అతనికి శాపనార్థాలు పెడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు