Viral video: అందుకే కుక్కను పెంచుకోమనేది.. మా ఓనర్ మీదకే వస్తారా? అని కుక్క ఏం చేసిందో చూడండి!
కుక్కల విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు అవి మన వెంటే తిరుగూ ఉంటాయి. మనం ఎక్కడికి వెళితే అక్కడివి వస్తుంటాయి. మనకు ఆపద వచ్చినప్పుడు ఆదుకుంటాయి. యజమాని ప్రాణాల మీదకు వచ్చిందంటే తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడుతాయి. దీనికి నిదర్శనం కింద మనం చూడబోయే ఈ వీడియోనే. గుజరాత్‌లోని మోబీ జిల్లాలో జరిగిన ఓ ఘటన పెంపుడు కుక్కలు యజమాని పట్ల ఎంత విశ్వాసంగా ఉంటాయో, అవి తోడు ఉంటే ఎంతటి రక్షణ ఉంటుందో తెలియజెస్తుంది.

ఈ మధ్య కాలంలో నేరాలు బాగా పెరిగిపోయాయి. కొందరు నేరగాళ్లు ఒంటరిగా ఉన్న వాళ్లను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ పెంపుడు కుక్క మనకు తోడు ఉంటే ఎంతటి రక్షణ ఉంటుందో గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన తెలియజేస్తుంది. టంకరా మండలం మిటానా గ్రామంలో నివసించే అమిత్ అనే యువకుడు పెళ్లిళ్లకు గుర్రాలను అద్దెకు ఇస్తూ ఉంటాడు. అయితే ఇటీవల ఒక రోజు రాత్రి అమిత్ ఇంట్లో చొరబడిన ముగ్గురు వ్యక్తులు అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తారు. దీంతో వాళ్ల నుంచి తప్పించుకున్న అమిత్ బయటకు పరుగెడతాడు. అది గమనించిన అక్కడే ఉన్న అతని పెంపుడు కుక్క వాళ్లను చూసి మొరగడం స్టార్ట్ చేస్తుంది. దీంతో అమిత్ ఆ కుక్కకు ఉన్న బెల్ట్‌ను విప్పదీస్తాడు. బెల్టు తీయగానే రెచ్చిపోయి రంగంలోకి దిగిన ఆ పెంపుడు కుక్క దుండగులపైకి దూసుకెళ్లి వాళ్లతో పోరాడుతుంది. తన యజమానిపై ఒక్క దెబ్బ కూడా పడనీయకుండా కాపాడుతుంది. పెంపుడు కుక్క దాడికి ఆ దుండగులు అక్కడి నుంచి పారిపోతారు. ఈ తతంగం అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అందరూ ఆ కుక్క పోరాటానికి హ్యాట్సాప్ చెబుతున్నారు. తాము కూడా పెంపుడు కుక్కను పెంచుకుంటామని కామెంట్స్ చేస్తున్నారు.
⏭️मोरबी में हमले के दौरान वफादार कुत्ता बना जान का रक्षक, हमलावरों को दौड़ाकर भगाया….
⏭️मिताना गांव में घर के बाहर सो रहे युवक पर तीन अज्ञात लोगों ने किया लोहे की वस्तु से हमला….
⏭️पालतू कुत्ते ने दिखाया बहादुरी का जज़्बा….#Gujarat #Morbi #Dog… pic.twitter.com/xIaHhTGJvF
— Silent Killer🔥 (@Kanhaiyakr99) April 18, 2025
అమిత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదైనా పెళ్లి వేడుకలకు గుర్రాలను ఏర్పాటు చేసిన సందర్భంలో ఎవైనా వివాదాలు జరిగాయా, ఆ వివాదాలకు సంబంధించిన వారెవరైనా అమిత్‌పై దాడి చేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….
