రోడ్డుపై ఆటో డ్రైవర్‌తో గొడవ.. కొద్ది సేపటికే చనిపోయిన మాజీ MLA

రాష్ట్రం కానీ రాష్ట్రానికి వచ్చిన ఓ మాజీ ఎమ్మెల్యే ఆటో డ్రైవర్ తో గొడవ పడిన కొద్ది సేపటికే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

రోడ్డుపై ఆటో డ్రైవర్‌తో గొడవ.. కొద్ది సేపటికే చనిపోయిన మాజీ MLA
Lavoo Mamledar

Updated on: Feb 16, 2025 | 11:35 AM

ఓ మాజీ ఎమ్మెల్యే ఆటో డ్రైవర్‌తో గొడవ పడిన కొద్ది నిమిషాల్లోనే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అసలింతకీ మాజీ ఎమ్మెల్యేతో ఎందుకు గొడవ పెట్టుకున్నారు? పెద్ద ఘర్షణ ఏం జరగకుండానే ఆయన కొన్ని నిమిషాల్లోనే ఎలా ప్రాణాలు కోల్పోయారనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన బెంగళూరులోని బెళగావిలో చోటు చేసుకుంది. గోవాకు చెందిన మాజీ ఎమ్మెల్యే లావో మామలేదార్‌(69) ఏదో పని నిమిత్తం బెంగళూరుకు వచ్చారు. ఖడేబజార్‌లోని ఓ లాడ్జ్‌కి వెళ్లే క్రమంలో ఓ ఆటో డ్రైవర్‌తో వివాదం ఏర్పడింది. ఆయన కారు ఓ ఆటోకు తాకిందని, దాంతో ఆ ఆటో డ్రైవర మాజీ ఎమ్మెల్యే కారును వెంబడిస్తూ.. లాడ్జ్‌ వరకు వచ్చి, లావోతో గొడవకు దిగాడు.

మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. అక్కడున్న వారు ఇద్దరికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపేశారు. గొడవ జరిగిన తర్వాత లాడ్జ్‌లోకి ఎంటర్‌ అవ్వగానే లావో కుప్పకూలిపోయారు. వెంటనే లాడ్జ్‌ సిబ్బంది ఆయనను సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని ఆ ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసున్నట్లు బెళగావి డీసీపీ రోహన్ జగదీశ్‌ తెలిపారు. గోవాలోని పోండా నియోజకవర్గం నుంచి 2012-17 సమయంలో లావో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొంది ఎమ్మెల్యేగా సేవలు అందించారు. అయితే.. ఆటో డ్రైవర్‌ దాడి చేయడంతో లావో చనిపోయారా? లేక ఆ గొడవ కారణంగా బీపీ పెరిగిన చినిపోయారా? గుండెపోటు ఏమైనా వచ్చిందా? అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.