Girls Night Out: అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలకూ నైట్ లైఫ్.. ఐడియా అదుర్స్
'గర్ల్స్ నైట్‌అవుట్' అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా మంది అమ్మాయిలు పాల్గొన్నారు.వారి తల్లిదండ్రులు కూడా ఈ చొరవతో చాలా సంతోషించారు.

మనం ఎక్కువగా అబ్బాయిలు నైట్ అవుట్, నైట్ లైఫ్ గురించి మాట్లాడుకోవడం చూశాం, విన్నాం.. అబ్బాయిలు భయం లేకుండా రాత్రిపూట సులభంగా బయటకు వెళతారు. కానీ అమ్మాయిలు చాలా ఆలోచించాలి. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలు ఎలాంటి భయం లేకుండా ‘నైట్ లైఫ్’ని ఎంజాయ్ చేసేందుకు కేరళలో నాలుగు రోజులపాటు ‘గర్ల్స్ నైట్ అవుట్’ క్యాంపెయిన్ నిర్వహించారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికి కేరళ ప్రభుత్వం ఇలాంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో ఫుడ్ స్టాల్స్, లైవ్ మ్యూజిక్, జుంబా డ్యాన్స్, మారథాన్‌లు వంటి ఈవెంట్‌లు ఉన్నాయి. అమ్మాయిలు రాత్రుళ్లు ఇంటి నుండి బయటకు వచ్చేలా, అబ్బాయిల వలె నైట్ అవుట్ జీవితాన్ని ఆస్వాదించమని అమ్మాయిలను ప్రోత్సహించడం దీని ఉద్దేశ్యం. రాత్రి వేళల్లో బయటకు వెళ్లి సురక్షితంగా తమ పనులు చేసుకుని క్షేమంగా తిరిగి వచ్చేలా మహిళల్లో విశ్వాసాన్ని పెంచడం కోసమే ఈ ప్రయత్న అంటోంది కేరళ ప్రభుత్వం. అయితే, ఈ ప్రచారానికి విశేష స్పందన వస్తోందన్నారు స్దానిక ఎమ్మెల్యే. కేరళ మహిళలు కూడా నైట్ లైఫ్‌ని కోరుకుంటున్నారన్నారు.
ఇంతకు ముందు ఈ పట్టణంలో ప్రతి ఒక్కరూ రాత్రి 8.30కి ఇంటికి చేరుకునేవారన్నారు. వీధులన్నీ చీకటిగా మారిపోయేవన్న ఆయన..మహిళలు భద్రత గురించి ఆందోళన చెందకుండా రాత్రిపూట వీధుల్లోకి రావచ్చని నిరూపించడానికే ఈ గర్ల్స్ నైట్ ఔట్ కార్యక్రమాన్ని మొదలుపెట్టామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
తిరువనంతపురం నుండి ఎర్నాకులం వరకు అనేక నగరాలను కలిపే MC రోడ్‌లోని అర కిలోమీటరు మేర ‘గర్ల్స్ నైట్‌అవుట్’ జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా మంది అమ్మాయిలు పాల్గొన్నారు.వారి తల్లిదండ్రులు కూడా ఈ చొరవతో చాలా సంతోషించారు. అమ్మాయిలు లేదా మహిళలు కూడా చీకటి పడిన తర్వాత బయటకు వెళ్లగలరని వారంతా ధీమా వ్యక్తం చేశారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
