AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది” సీబీఐ ఛార్జీషీట్‌లో ఆ ముగ్గురి పేర్లు

అత్యాచార ఆరోపణలపై బీజేపీ నుంచి బహిష్కరించబడిన ఎమ్మెల్యే కులదీప్ సెంగార్.. కేసులో సీబీఐ అధికారులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో 2017లో ఓ మైనర్ యువతిపై స్ధానిక ఎమ్మెల్యేతో సహా ముగ్గురు వ్యక్తులు దారుణంగా అత్యాచారానికి పాల్పడినట్టు ఛార్జీషీట్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్టయిన సెంగార్ ప్రస్తుతం జైల్లో ఉంటూ కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే బాధితురాలు ఆమె న్యాయవాదితో సహా వస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాధ ఘటనలో ఆమె […]

ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది   సీబీఐ ఛార్జీషీట్‌లో  ఆ ముగ్గురి పేర్లు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 04, 2019 | 1:54 PM

Share

అత్యాచార ఆరోపణలపై బీజేపీ నుంచి బహిష్కరించబడిన ఎమ్మెల్యే కులదీప్ సెంగార్.. కేసులో సీబీఐ అధికారులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో 2017లో ఓ మైనర్ యువతిపై స్ధానిక ఎమ్మెల్యేతో సహా ముగ్గురు వ్యక్తులు దారుణంగా అత్యాచారానికి పాల్పడినట్టు ఛార్జీషీట్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్టయిన సెంగార్ ప్రస్తుతం జైల్లో ఉంటూ కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే బాధితురాలు ఆమె న్యాయవాదితో సహా వస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాధ ఘటనలో ఆమె తన సొంత అత్త, పిన్నిని సైతం కోల్పోగా, తన కేసును వాదిస్తున్న న్యాయవాదితో సహా ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స అందించగా. ప్రస్తుతం ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్చ్ అయ్యింది. అయితే అత్యాచారం కేసులో నిందితుడుగా ఉన్న సెంగార్ వీరిని చంపే ప్రయత్నం చేశాడని ఆమె చిన్నాన్న దాఖలు చేసిన మరో పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది.

2017లో ఈమెపై జరిగిన అత్యాచారానికి సంబంధించి సీబీఐ అధికారులు ఢిల్లీలోని తీజ్ హజారీ జిల్లా కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితడు కుల్‌దీప్ సెంగార్‌తో పాటు నరేశ్ తివారీ, బ్రిజేష్ యాదవ్ సింగ్, శుభం సింగ్ అనే ముగ్గురిపేర్లు కూడా చేర్చారు. ఈ ఛార్జీషీట్‌లో పేర్కొన్నదాన్నిబట్టి జూన్ 4న కుల్‌దీప్ సెంగార్ అత్యాచారానికి పాల్పడగా. వారం రోజుల తర్వాత ఆమెను కిడ్నాప్ చేసి చార్జీషీట్‌లో పేర్కొన్న ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. జూన్ 4న బాధితురాలిని ఎమ్మెల్యే తన నివాసానికి రప్పించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ అత్యాచారానికి పాల్పడ్డాడని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితురాలు నేనుగా యూపీ సీఎం యోగీ ఆదిత్యానాధ్ ఇంటిముందు ఆత్మహత్య యత్నం చేయడంతో.. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నావ్ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌ను బీజేపీ బహిష్కరణ వేటు వేసింది.

ఇదిలా ఉంటే ఉన్నావ్ బాధితురాలు న్యాయ పోరాటం చేస్తున్న సమయంలోనే అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణపై అరెస్ట్ చేయగా వారం విచారణలో మృతి చెందాడు. అయితే ఈ కేసులో స్టేషన్‌లో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ అమీర్‌ఖాన్ తనపై దాఖలైన కేసును కొట్టివేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే సెషన్స్ కోర్టు కేసు, మేజిస్ట్రియల్ కోర్టు కేసులను జతచేసి తనపై తప్పుడు అభియోగాలు మోపారని ఖాన్ ధర్మాసనానికి తెలిపాడు. అతడిపై ఐపీసీ సెక్షన్ 323 (ఉద్దేశ్యపూర్వంగా హానిచేయడం), 324 (మారణాయుధాలతో దాడి చేయడం), 166 (ఎవరైనా వ్యక్తిని గాయపర్చేందుకు ప్రభుత్వ ఉద్యోగి సైతం నిబంధనలు ఉల్లంఘించడం), 167 (గాయపర్చే ఉద్దేశంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి తప్పుడు పత్రాలు సృష్టించడం) తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఉన్నావ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. సీబీఐ దర్యాప్తులో అనేక విషయాలు వెల్లడికాగా తాజాగా అత్యాచారానికి సంబంధించి ఛార్జీషీట్ దాఖలైంది. మొత్తానికి 2017 నాటికి మైనర్‌గా ఉన్న యువతిని అత్యాచారం చేయడమే కాకుండా, ఆమెను దారుణంగా చంపే ప్రయత్నం చేయడం, ఆమె తండ్రి సైతం పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్ కావడం ఒక విషాదం. ఈ కేసులన్నీ ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణలో ఉన్నాయి.