PM Modi: G7 శిఖరాగ్ర సమావేశానికి బయలుదేరిన నరేంద్ర మోదీ.. హ్యాట్రిక్ ప్రధాని తొలి విదేశీ పర్యటన!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ-7 సదస్సులో పాల్గొనేందుకు గురువారం ఇటలీ వెళ్లారు. ప్రధాని మోదీ జీ-7 సమావేశాల్లో ఐదవ సారి పాల్గొంటున్నా. సదస్సులో అత్యంత సీనియర్ నాయకులలో ఒకరిగా నిలిచారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షులు జో బైడన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగా కలుసుకునే అవకాశం ఉంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ-7 సదస్సులో పాల్గొనేందుకు గురువారం ఇటలీ వెళ్లారు. ప్రధాని మోదీ జీ-7 సమావేశాల్లో ఐదవ సారి పాల్గొంటున్నా. సదస్సులో అత్యంత సీనియర్ నాయకులలో ఒకరిగా నిలిచారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షులు జో బైడన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగా కలుసుకునే అవకాశం ఉంన్నప్పటికీ, వారితో ఎలాంటి ద్వైపాక్షిక సమావేశం జరుగుతుందన్న దానిపై క్లారిటీ లేదు. జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రతినిధి బృందంతో కలిసి ఢిల్లీ నుంచి విమానంలో ఇటలీ బయలుదేరారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి, వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రధాని చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇది. ఇటలీకి బయలుదేరే ముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ, G7 ఔట్‌రీచ్ సమ్మిట్ ప్రపంచవ్యాప్తంగా క్లిష్టమైన అంశాలపై చర్చించడానికి ఒక అవకాశం అని అన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎనర్జీ, ఆఫ్రికా, మెడిటరేనియన్ అంశాలపై జీ-7 సదస్సులో చర్చలు జరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
PM Shri @narendramodi departs for Italy to attend the G7 Summit, following an official invitation from Italian PM @GiorgiaMeloni.
PM Modi will also hold meetings with various global leaders during the Summit. pic.twitter.com/hlLJeSCqy8
— BJP (@BJP4India) June 13, 2024
ఇటలీలోని అపులియా ప్రాంతంలో శుక్రవారం G7గా పిలిచే గ్రూప్ ఆఫ్ సెవెన్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. అయితే, G7 లేదా ఇతర నేతలతో నిర్దిష్ట ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొనడం గురించి పీఎంవో ప్రస్తావించలేదు. అయితే ఇటలీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో భేటీ కానున్నట్లు సమాచారం.
మరన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
