Strawberries Farming: ఖైదీల్లో మార్పు తీసుకొచ్చేందుకు జైలు సిబ్బంది కృషి.. స్టాబెర్రీలు పండిస్తూ లాభాలను ఆర్జిస్తున్న ఖైదీలు

ఖైదీలు నేర ప్రవృత్తిని తప్పుడు మార్గానికి  వదిలి..  జీవితాని మంచి మార్గంలో నడిచేలా చేయాలనీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సమాజంలో గౌరవంగా బతికేలా మంచి జీవనోపాధిని ఎంచుకోవచ్చు.

Strawberries Farming: ఖైదీల్లో మార్పు తీసుకొచ్చేందుకు జైలు సిబ్బంది కృషి.. స్టాబెర్రీలు పండిస్తూ లాభాలను ఆర్జిస్తున్న ఖైదీలు
Strawberries Cultivation

Updated on: Jan 09, 2023 | 9:04 PM

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జైలులో ఉన్న ఖైదీలు వ్యవసాయం బాట పట్టారు. ప్రస్తుతం స్ట్రాబెర్రీలను పండిస్తున్నారు. ఈ ఖైదీలు స్ట్రాబెర్రీలను పండిస్తూ ఇతర ఖైదీలకు ఉదాహరణగా నిలిచారు. స్ట్రాబెర్రీలను కొండ ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. మైదాన ప్రాంతాల్లో సాగు చేయడం చాలా కష్టం. అయితే ఈ ఖైదీలకు స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్ కింద శిక్షణ ఇప్పించి వారికి కొత్త జీవితాన్ని అందించేందుకు జిల్లా జైలు సూపరింటెండెంట్,  జైలర్ ప్రయత్నించారు.

బారాబంకి జిల్లా జైలులో.. సెక్షన్ 302తో సహా అనేక ప్రధాన నేరాల్లో ఖైదీలు ఉన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో దొంగతనం దోపిడీలు చేసిన ఖైదీలు. అయితే ఇప్పుడు వీరి మనసు మారుతోంది. ప్రభుత్వ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ పథకం కింద 1600 మంది ఖైదీలకు ప్రగతిశీల సేద్యం గురించి పాఠాలను చెబుతున్నారు. ఈ ఖైదీల్లో మార్పులు తీసుకొచ్చే విధంగా శిక్షణ ఇస్తూ.. కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకు ఆ జైలు సూపరింటెండెంట్‌, జిల్లా జైలు జైలర్‌ ప్రయత్నిస్తున్నారు.

జైలు నుంచి విడుదలయ్యాక ఈ వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుంటాం.. 

ఇవి కూడా చదవండి

వాస్తవానికి, యుపి ప్రభుత్వం  స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్ పథకం కింద, ఖైదీలకు ఇప్పుడు వ్యవసాయం చేసే విధానాన్ని  నేర్పిస్తున్నారు. జిల్లా కారాగారంలోని ఖైదీలు వ్యవసాయంలో నైపుణ్యం సాధించడంతో చాలా సంతోషంగా ఉన్నారు. స్ట్రాబెర్రీ సాగు నేర్చుకుని తమకు పండించిన పంటకు లాభాలను ఆర్జిస్తున్నారు. దీంతో కొంతమంది ఖైదీలు తాము జైలు నుంచి విడుదలయ్యాక ఈ వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకుంటామని చెబుతున్నారు.

జిల్లా జైలులో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 కింద శిక్ష పడిన ఖైదీలకు జిల్లా జైలు సూపరింటెండెంట్ PP సింగ్ సలహా మేరకు దాదాపు ఒక బిగా (ఎకరంన్నరకు పైగా) జైలు భూమిలో స్ట్రాబెర్రీ సాగు ప్రారంభించారు. స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్ కింద వ్యవసాయం చేసే విధానాన్ని వారికి నేర్పించారు. అక్టోబరు నెలలో.. ఇతర సహచరులతో కలిసి వ్యవసాయం ప్రారంభించారు. అప్పుడు స్ట్రాబెర్రీలను నాటడానికి భూమిని సిద్ధం చేశారు. స్ట్రాబెర్రీ మొక్కను నాటారు. 4 నెలల్లో పంట చేతికి వచ్చింది. చేతికి అందిన పంటను ఇప్పుడు ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి  పంపించడానికి సిద్ధం చేస్తున్నారు.

ఖైదీల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది

గత ఏడాది ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్ జైలులోని ఖైదీలకు పుట్టగొడుగుల పెంపకంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఖైదీలు నేర ప్రవృత్తిని తప్పుడు మార్గానికి  వదిలి..  జీవితాని మంచి మార్గంలో నడిచేలా చేయాలనీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సమాజంలో గౌరవంగా బతికేలా మంచి జీవనోపాధిని ఎంచుకోవచ్చు. ఖైదీల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ ఆర్ బన్సల్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..