Twitter: మస్క్‌ అనుకున్నది చేశాడుగా.. సెలబ్రిటీల ట్విట్టర్ల బ్లూటిక్‌ తొలగింపు.. రాహుల్, షారుఖ్‌, కోహ్లీతో సహా..

|

Apr 21, 2023 | 10:55 AM

కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, క్రికెటర్లు ఎంఎస్‌ ధోని, విరాట్ కోహ్లీ, నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్‌ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఆలియా భట్, దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా, రజనీకాంత్, విజయ్‌, శింబు లాంటి స్టార్‌ సెలబ్రిటీల ఖాతాలకు బ్లూ టిక్‌ మార్క్‌ కనిపించడం లేదు.

Twitter: మస్క్‌ అనుకున్నది చేశాడుగా.. సెలబ్రిటీల ట్విట్టర్ల బ్లూటిక్‌ తొలగింపు.. రాహుల్, షారుఖ్‌, కోహ్లీతో సహా..
Twitter Blue Tick
Follow us on

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ సెలబ్రిటీలకు షాక్‌ ఇచ్చింది. దేశంలోని సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల ట్విట్టర్‌ ఖాతాలకు బ్లూటిక్‌ తొలగించింది. నిజమైన సెలబ్రిటీల ఖాతాలను గుర్తించేందుకు ఉపయోగపడే ఈ బ్లూటిక్​ను.. నెలవారీ సబ్​స్క్రిప్షన్ తీసుకున్నవారికే కేటాయిస్తోంది ట్విట్టర్. సాధారణ యూజర్లు సైతం బ్లూటిక్ పొందేలా సబ్​స్క్రిప్షన్ ప్లాన్లు రూపొందించింది. అలాగే డబ్బులు చెల్లించనివారికి తాజాగా టిక్ మార్క్​ను తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. అమెరికాలోని కాలిఫోర్నియా కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం నుంచి టిక్ మార్క్​ల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, క్రికెటర్లు ఎంఎస్‌ ధోని, విరాట్ కోహ్లీ, నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్‌ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఆలియా భట్, దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా, రజనీకాంత్, విజయ్‌, శింబు లాంటి స్టార్‌ సెలబ్రిటీల ఖాతాలకు బ్లూ టిక్‌ మార్క్‌ కనిపించడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లోనూ..

ఇక తెలుగు రాష్ట్రాల్లో సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, వెంకటేశ్‌, మోహన్‌ బాబు, అక్కినేని నాగచైతన్య, అఖిల్ అక్కినేని, నితిన్, ప్రకాశ్ రాజ్, పూజా హెగ్డే, కీర్తి సురేష్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి, మంచు మనోజ్.. ఇలా చాలా మంది ప్రముఖులు తమ బ్లూ టిక్‌ను కోల్పోయారు. అయితే తారక్‌ , మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, మంచు విష్ణుల ఖాతాలకు మాత్రం బ్లూ టిక్‌లు కనిపిస్తున్నాయి. వీరంతా ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని ఉంటారని తెలుస్తోంది.

ఛార్జీలు ఎంతంటే?

కాగా నిజమైన సెలబ్రిటీలను వెరిఫై చేసి ఈ బ్లూ టిక్ మార్క్ ఇచ్చేవారు. రాజకీయ నేతలు, అథ్లెట్లు, జర్నలిస్టులు, పబ్లిక్ ఫిగర్లను సులభంగా గుర్తించేందుకు ఈ వెరిఫికేషన్ ఉపయోగపడుతోంది. అయితే ప్రస్తుతం సామాన్య యూజర్లకు బ్లూటిక్‌ లభిస్తోంది. ట్విట్టర్ ఖాతాకు అనుసంధానమైన ఫోన్ నెంబర్​తో వెరిఫికేషన్ పూర్తి చేసి, సబ్​స్క్రిప్షన్ పొందితే.. బ్లూటిక్ మార్క్ వస్తోంది. ఇక బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం ట్విట్టర్ యూజర్లు నెలకు రూ.650, ఏడాదికైతే రూ.6500 డిస్కౌంట్ ఆఫర్‌ను ట్విట్టర్ అందిస్తోంది. దీనికి ఈ ఏడాది ఏప్రిల్ 20 ఆఖరి తేదీగా ప్రకటించింది. ఈ లోపల బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోనివారు బ్లూటిక్ కోల్పోతారని ప్రకటించారు. ఈక్రమంలోనే దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు తమ ట్విట్టర్‌ ఖాతాలకు బ్లూ టిక్‌ మార్క్‌ను కోల్పోయారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..