కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌.. విషవాయువు పీల్చి నలుగురు మృతి..

|

Dec 29, 2024 | 6:23 PM

ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. నాలుగో కూలీ ఉదయం 6 గంటలకు మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఈ ఘటనపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కంపెనీ నిర్లక్ష్యానికి కారణమని ప్రజలు ఆరోపిస్తూ, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌.. విషవాయువు పీల్చి నలుగురు మృతి..
Gujarat Gas Leak
Follow us on

గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. దహేజ్‌లో ఓ రసాయన కర్మాగారంలో విష వాయువు లీకేజీ కారణంగా నలుగురు కార్మికులు మృతిచెందారు. దహేజ్ ప్రాంతంలోని గుజరాత్ ఫ్లూరో కెమికల్స్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ యూనిట్ లో ఈ ప్రమాదం జరిగింది. వాయువులు వెళ్లే ఒక పైప్‌లైన్‌కు రంధ్రం పడటంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు నిపుణులు గుర్తించారు. వాయువును పీల్చిన వెంటనే నలుగురు కార్మికులు స్పృహ కోల్పోయారు. వారిని గుర్తించిన ఇతర సిబ్బంది.. ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తర్వాత కొద్ది సేపటికే నలుగురు చనిపోయారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది..

ఈ మేరకు దహేజ్ పోలీస్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ..కార్మికులను భరూచ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. నాలుగో కూలీ ఉదయం 6 గంటలకు మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించి గుజరాత్‌ ఫ్లోరోకెమికల్స్‌ లిమిటెడ్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఘటనపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కంపెనీ నిర్లక్ష్యానికి కారణమని ప్రజలు ఆరోపిస్తూ, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి