తండ్రి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని కూతురు.. అనుమానంతో అల్లుడి ఇంటికెళ్లి చూడగా..

|

Jul 23, 2023 | 9:59 AM

Coimbatore News: తమిళనాడులోని కోయంబత్తూరులో దారుణం చోటుచేటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. అందరూ విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.

తండ్రి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని కూతురు.. అనుమానంతో అల్లుడి ఇంటికెళ్లి చూడగా..
Crime News
Follow us on

Coimbatore News: తమిళనాడులోని కోయంబత్తూరులో దారుణం చోటుచేటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. అందరూ విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. కోయంబత్తూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాడవల్లి వెంబు అవెన్యూ కురించినగర్‌కు చెందిన రాజేష్ (34) ఒక ప్రైవేట్ కంపెనీలో డిజైనర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తన తల్లి.. ప్రేమ (73), భార్య శృతి (29), కుమార్తె యక్షిత (10) తో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న ఉదయం నుంచి శృతి తండ్రి బాలన్ కూతురి మొబైల్ నంబర్‌కు ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు కాల్‌ చేసినా.. ఎటువంటి సమాధానం రాకపోవడంతో అనుమానంతో.. కూనూర్‌ నుంచి కోయంబత్తూరులోని బాలన్ ఇంటికి వచ్చి ఇంటి తలుపులు తట్టాడు.

ఆ సమయంలో లోపలి నుంచి గడియపెట్టి ఉండడం.. కిటీకీ దగ్గరకు వెళ్లడంతో ఒక్కసారిగా ఇంట్లో నుంచి దుర్వాసన వచ్చింది. దీంతో బాలన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న వాడవల్లి పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా.. రాజేష్, శృతి, కూతురు యక్షిత, తల్లి ప్రేమ విగత జీవులుగా పడి ఉన్నారు. వీరు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.

వివరాలు సేకరించిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పుల బాధతో ఈ నిర్ణయం తీసుకున్నారా..? అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..