AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గణతంత్ర వేడుకల సాక్షిగా… వరుస పేలుళ్లతో దద్దరిల్లిన అసోం..

ఓ వైపు దేశ ప్రజానీకం మొత్తం గణతంత్ర వేడుకల్లో నిమగ్నమై ఉంటే.. మరోవైపు ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో వరుస పేలుళ్లలకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా.. దేశంలో ఉగ్రమూకలు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. నిఘా వర్గాల హెచ్చరికలను నిజం చేస్తూ.. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో.. ఉదయం వరుస పేలుళ్లు సంభవించాయి. డిబ్రూగర్, చరైదేవ్, దులియాజాన్ ప్రాంతాల్లో గ్రనేడ్ ఎటాక్‌లు జరిగాయి. ఈ ఘటనకు […]

గణతంత్ర వేడుకల సాక్షిగా... వరుస పేలుళ్లతో దద్దరిల్లిన అసోం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 26, 2020 | 12:54 PM

Share

ఓ వైపు దేశ ప్రజానీకం మొత్తం గణతంత్ర వేడుకల్లో నిమగ్నమై ఉంటే.. మరోవైపు ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో వరుస పేలుళ్లలకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా.. దేశంలో ఉగ్రమూకలు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. నిఘా వర్గాల హెచ్చరికలను నిజం చేస్తూ.. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో.. ఉదయం వరుస పేలుళ్లు సంభవించాయి.

డిబ్రూగర్, చరైదేవ్, దులియాజాన్ ప్రాంతాల్లో గ్రనేడ్ ఎటాక్‌లు జరిగాయి. ఈ ఘటనకు పాల్పడింది యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ పనే అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇది ఓ నిషేధిత తీవ్రవాద సంస్థ. రిపబ్లిక్ వేడుకలను బహిష్కరించాలంటూ ఈ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ శనివారం పిలుపునిచ్చింది. గ్రాహం బజార్‌లో తొలి పేలుడు సంభవించగా.. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఓ వైపు గణతంత్ర వేడుకలు జరుగుతుండగా.. ఈ వరుస బాంబు పేలుళ్లు కలకలాన్ని సృష్టించాయి.

కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు