71 వ గణతంత్రం.. ఇది భారత ‘యుధ్ధతంత్రం’

71 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఆదివారం ఘనంగా జరిగాయి. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలు 90 నిముషాలపాటు సాగాయి. దేశ ఆయుధ సంపత్తిని, సైనిక సత్తాను, సాంస్కృతిక వైభవాన్ని చాటుతూ వివిధ శకటాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. ప్రధాని మోదీ జాతీయ యుధ్ధ స్మారకాన్ని సందర్శించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం.. ఈ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. అమర్ జవాన్ జ్యోతి వద్ద […]

71 వ గణతంత్రం.. ఇది భారత 'యుధ్ధతంత్రం'
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jan 26, 2020 | 12:32 PM

71 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఆదివారం ఘనంగా జరిగాయి. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలు 90 నిముషాలపాటు సాగాయి. దేశ ఆయుధ సంపత్తిని, సైనిక సత్తాను, సాంస్కృతిక వైభవాన్ని చాటుతూ వివిధ శకటాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. ప్రధాని మోదీ జాతీయ యుధ్ధ స్మారకాన్ని సందర్శించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం.. ఈ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. అమర్ జవాన్ జ్యోతి వద్ద శ్రధ్ధాంజలి ఘటించే బదులు మోదీ ఈ స్మారకం వద్ద నివాళి అర్పించడం ఇదే మొదటిసారి. జాతీయ జెండా ఆవిష్కరణ, జనగణమన గీతాలాపన, 21 తుపాకులతో గన్ సెల్యూట్ కనువిందుగా సాగాయి. ఇక ఆర్మీ వారి’భీష్మ’, వైమానిక దళ రఫెల్ విమానం, చినూక్, అపాచీ హెలికాఫ్టర్లు, రుద్ర, ధృవ్ అడ్వాన్స్డ్ హెలీకాఫ్టర్లతో బాటు తేజాస్ విమానం, ఆకాష్, అస్త్ర మిసైల్ సిస్టమ్స్, యాంటీ శాటిలైట్ వెపన్ ‘ మిషన్ శక్తి’ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తం 22 శకటాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. అయితే పశ్చిమ బెంగాల్, కేరళ వంటి కొన్ని రాష్ట్రాల శకటాల నమూనాలను కేంద్రం తిరస్కరించడంతో.. అవి ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొనలేకపోయాయి.తెలంగాణ ఫెస్టివ్ సీజన్ ను ప్రతిబింబించే ‘ బతుకమ్మ ‘ శకటం అద్భుత రీతిని చాటింది.

ఇండియన్ ఆర్మీలో 61 వ కేవల్రీ.. గ్వాలియర్ ల్యాన్సర్స్ యూనిఫామ్ లో సైనిక జవాన్లు, వైమానిక దళం నుంచి 144 మంది ఎయిర్ వారియర్స్  జరిపిన పరేడ్ అలరించింది. సీఆర్ పీఎఫ్ మహిళా బైకర్లు తమ టూ వీలర్స్ తో చేసిన స్టంట్లు అబ్బో అనిపించాయి.  రాజ్ పథ్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.