చిద్దూ అరెస్టు కోసం గోడనెక్కిన పోలీసుకు రాష్ట్రపతి మెడల్
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని హౌస్ అరెస్టు చేసేందుకు ఆయన ఇంటి గోడనెక్కిన డీఎస్పీ రామస్వామి పార్థసారథికి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ లభించింది. ఈ కేసులో చిదంబరం అరెస్ట్ కోసం శ్రమించిన 28 మంది సీబీఐ అధికారుల్లో ఈయన కూడా ఒకరు. గత ఏడాది చిదంబరం అరెస్టు అయిన సంగతి తెలిసిందే.విశిష్ట సేవలందించిన పోలీసు అధికారులు… రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు సేవా పతకాలు అందుకున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులోనే చిదంబరం […]
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని హౌస్ అరెస్టు చేసేందుకు ఆయన ఇంటి గోడనెక్కిన డీఎస్పీ రామస్వామి పార్థసారథికి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ లభించింది. ఈ కేసులో చిదంబరం అరెస్ట్ కోసం శ్రమించిన 28 మంది సీబీఐ అధికారుల్లో ఈయన కూడా ఒకరు. గత ఏడాది చిదంబరం అరెస్టు అయిన సంగతి తెలిసిందే.విశిష్ట సేవలందించిన పోలీసు అధికారులు… రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు సేవా పతకాలు అందుకున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులోనే చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని కూడా రామస్వామి అరెస్టు చేశారు. ఇక ముంబై జర్నలిస్ట్ జే డే హత్య దర్యాప్తు కేసులో కీలకంగా వ్యవహరించిన ధీరేంద్ర శుక్లా కూడా తన సేవలకు గాను ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు. మొట్ట మొదటిసారిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి నిందితుడు రోషన్ అన్సారీని ఇండియాకు తీసుకొచ్చిన ప్రత్యేక బృందానికి శుక్లా నేతృత్వం వహించారు.