Cylinder Blast: పెళ్లింట ఘోర ప్రమాదం.. పేలిన గ్యాస్ సిలిండర్.. నలుగురు దుర్మరణం..

ఓ వివాహ వేడుకలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పంజాబ్ (Punjab) లోని విక్రమ్‌పూర్‌ గ్రామంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Cylinder Blast: పెళ్లింట ఘోర ప్రమాదం.. పేలిన గ్యాస్ సిలిండర్.. నలుగురు దుర్మరణం..
Gas Cylinder Blast

Updated on: Jul 03, 2022 | 9:23 AM

Gas Cylinder Blast: పంజాబ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫజిల్కా జిల్లాలోని జలాలాబాద్ ప్రాంతంలో శనివారం జరిగిన ఓ వివాహ వేడుకలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పంజాబ్ (Punjab) లోని విక్రమ్‌పూర్‌ గ్రామంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక బాలిక ఉన్నట్లు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారని.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విక్రమ్‌పూర్ గ్రామంలోని ఓ ఇంట్లో వివాహ వేడుక జరుగుతోంది. ఈ సయంలో సిలిండర్ రెగ్యులేటర్‌ నుంచి గ్యాస్ లీక్ అయింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. వివాహ వేడుకలో ఉండగా.. ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. సిలిండర్ పేలిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా.. ముగ్గురు గాయపడినట్లు పేర్కొన్నారు.

సిలిండర్ రెగ్యులేటర్‌లో లీక్ కారణంగా పేలుడు సంభవించి మంటలు చెలరేగినట్లు జలాలాబాద్ సీఓ మాసా సింగ్ తెలిపారు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి