Gali Janardan Reddy: కర్నాటకలో మరో కొత్త పార్టీ.. పేరును ప్రకటించిన మాజీ మంత్రి.. పూర్తి వివరాలివే..

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సొంత పార్టీ స్థాపించారు. ఇన్నాళ్లు బీజేపీలో కంటిన్యూ అవుతున్న ఆయన.. కొత్త పార్టీ పెట్టడం కర్నాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గనుల అక్రమ తవ్వకాలకు...

Gali Janardan Reddy: కర్నాటకలో మరో కొత్త పార్టీ.. పేరును ప్రకటించిన మాజీ మంత్రి.. పూర్తి వివరాలివే..
Gali Janardan Reddy

Updated on: Dec 25, 2022 | 4:16 PM

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సొంత పార్టీ స్థాపించారు. ఇన్నాళ్లు బీజేపీలో కంటిన్యూ అవుతున్న ఆయన.. కొత్త పార్టీ పెట్టడం కర్నాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో గాలి జనార్దన్ రెడ్డి నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. పార్టీని వీడొద్దని బీజేపీ ప్రయత్నాలు చేసినప్పటికీ తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన కొత్త పార్టీ వైపే మొగ్గు చూపారు. అయితే ఈ పార్టీ వల్ల ఓట్లు చీలే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కాగా.. గంగావతిలోని ఓ అభివృద్ధి కార్యక్రమానికి రూ.6 కోట్లు విరాళం ఇవ్వనున్నట్లు గాలి జనార్దన్‌ ఇటీవల ప్రకటించారు. ఈ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయనే గుసగుసలు వచ్చాయి. ఈ క్రమంలో కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వానికి దూరంగా ఉంటున్నారు గాలి జనార్దన్ రెడ్డి. ఈ తరుణంలోనే ఆయన సొంతంగా పార్టీని పెట్డం గమనార్హం.

ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గంగావతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు తీవ్రం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన భార్యతో కలిసి నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేస్తూ అక్కడి ప్రజలతో మమేకయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు గాలి జనార్దన్ రెడ్డి. గనుల అక్రమ తవ్వకాల కుంభకోణంలో ఆయనతోపాటు 9 మందిపై సీబీఐ 2009లో కేసులు నమోదు చేసింది. 2011 సెప్టెంబరులో జనార్దన్‌రెడ్డిని అరెస్టు అయ్యారు. జైలుకు కూడా వెళ్లారు. నాలుగేళ్ల జైలు శిక్ష అనంతరం 2015 జనవరి 20న కొన్ని షరతులతో కూడిన బెయిలును సుప్రీంకోర్టు మంజూరు చేసింది.

కాగా.. కర్నాటకలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గాలి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన మరో రాజకీయ పార్టీ రానున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఈనెల 10న ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌ వద్ద కొత్త పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. కల్యాణ కర్ణాటకలో బళ్లారి, రాయచూరు, యాద్గిర్, కలబురగి, కొప్పళ, విజయనగర జిల్లాల పరిధిలో 48 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ సమయంలో గాలి జనార్దన్ రెడ్డి పార్టీ పెట్టడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..