
హైదరాబాద్ అనగానే ప్రతి ఒక్కరికీ నివాసయోగ్యమైన ప్రాంతంగా ప్రసిద్ది చెందింది. ఈ బిరుదును మనకు మనంగా ఇచ్చుకుంటే సరిపోదు. పక్క దేశాల వాళ్లు ఇవ్వాలి. లేదా ఇక్కడికి వచ్చి చూసిన వాళ్లు చెప్పాలి. అప్పుడే దీనికి ఒక విలువ ఉంటుంది. ఇలాంటి ఒక సర్వేని నిర్వహించింది మెర్సర్ అనే సంస్థ. మెర్సెర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ డేటా గ్లోబల్ అసైన్మెంట్ లొకేషన్స్‌లో పొరుగు ప్రాంతాల వారి జీవన ప్రమాణాన్ని లెక్కగట్టింది. వలస వచ్చిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు రోజువారీ జీవితంలో ఆచరించే కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంది. దీని ప్రకారం వారి స్థితి గతులు, జీవన శైలిని అంచనా వేసింది.
2023 సంవత్సరానికి గానూ మెర్సెర్ గణాంకాల ఆధారంగా దేశంలోని టాప్ 10 నగరాల జాబితాలో హైదరాబాద్‌కు చోటు దక్కింది. గ్లోబల్ ర్యాంకింగ్‌లో 153వ స్థానాన్ని కైవసం చేసుకొని మొదటి స్థానంలో నిలిచింది. పూణె 154 ర్యాంకుతో రెండవ స్థానంలో ఉంది. దీంతో పాటూ మరి కొన్ని నగరాలకు వాటి స్థితిగతులను బట్టి ర్యాంకులను అందించింది.
హైదరాబాద్ కేవలం నాణ్యమైన జీవన ప్రమాణాలు కలిగిన నగరాల్లో మాత్రమే కాకుండా సురక్షితమైన నగరాల జాబితాలో కూడా చోటు దక్కించుకుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం, 2022లో, నగరంలో ప్రతి లక్ష మందికి 266.7 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అదే కోల్‌కతా నగరం దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరం అనే బిరుదును కలిగి ఉంది. దీనికి కారణం సంవత్సరంలో ప్రతి లక్ష మందికి 78.2 నేరాలపై మాత్రమే కేసులు నమోదైనట్లు గుర్తించబడింది.
వీటితో పాటూ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల జీవన ప్రమాణాలను లెక్కగట్టింది. అందులో ఆస్ట్రియాలోని వియన్నా అగ్రస్థానంలో ఉండగా.. జ్యూరిచ్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
గత తొమ్మిదేళ్ల పాలనలో హైదరాబాద్ నగరాన్ని 6 సార్లు మెర్సర్ చార్ట్ లలో అగ్రస్థానంలో నిలిపామని మేము నిర్ధారించుకున్నాము. ఇప్పడు కొత్త ప్రభుత్వం దానిని తదుపరి స్థానానికి తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. నేను హైదరాబాదీగా ఉన్నందుకు గర్విస్తున్నాను అని ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 2015 నుంచి మెర్సర్ చేత భారతదేశంలో హైదరాబాద్ అత్యుత్తమ నగరంగా ప్రశంసలు అందుకుంటున్నామన్నారు.
Proud Hyderabadi ❤️
We have ensured Hyderabad city topped the Mercer charts 6 times in last 9 years
Now it’s for the new Govt to take it to next level pic.twitter.com/s5F0qnvLeV
— KTR (@KTRBRS) December 13, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..