Rahul Gandhi: అధికార నివాసాన్ని ఖాళీ చేసిన రాహుల్‌గాంధీ.. బలవంతంగా పంపించారంటూ ఆవేదన..

|

Apr 22, 2023 | 8:46 PM

ప్రజా సమస్యలపై గళమెత్తినందుకే తనపై అనర్హత వేటు వేశారని మండిపడ్డారు రాహుల్‌గాంధీ. ఢిల్లీలో అధికారిక నివాసాన్ని రాహుల్‌ ఖాళీ చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతుందన్నారు రాహుల్‌.

Rahul Gandhi: అధికార నివాసాన్ని ఖాళీ చేసిన రాహుల్‌గాంధీ.. బలవంతంగా పంపించారంటూ ఆవేదన..
Rahul Gandhi Vacating House
Follow us on

ఢిల్లీలో తన అధికార నివాసాన్ని ఖాళీ చేశారు కాంగ్రెస్‌ మాజీ ఎంపీ రాహుల్‌గాంధీ. 12 తుగ్లక్‌ రోడ్డులోని ఎంపీ నివాసాన్ని ఖాళీ చేశారు. సిబ్బందితో అప్యాయంగా మాట్లాడి ఇంటి నుంచి వెళ్లిపోయారు రాహుల్‌గాంధీ. తనకు ఇన్నాళ్లు సేవలందించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్‌ ఇంటిని ఖాళీ చేసే సమయంలో సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ తోడుగా ఉన్నారు.

తన ఇంటి తాళాలను లోక్‌సభ హౌసింగ్‌ కమిటీ సిబ్బందికి అప్పగించారు రాహుల్‌గాంధీ. మోదీ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయనపై అనర్హత వేటు విధించిన సంగతి తెలిసిందే. ఎంపీ నివాసాన్ని ఖాళీ చేయాలని నోటీసులు రావడంతో రాహుల్‌ వెంటనే స్పందించారు.

ఆ ఇంటితో 19 ఏళ్ల అనుబంధం.. బలవంతంగా ఇంటిని ఖాళీ చేయించారన్న రాహుల్..

ఆ ఇంటితో 19 ఏళ్ల అనుబంధం ఉందన్నారు రాహుల్‌గాంధీ. బలవంతంగా ఇంటిని ఖాళీ చేయించారని ఆరోపించారు. తాను ఎవరికి భయపడడం లేదని . ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. వాస్తవాలు మాట్లాడినందుకు ఇలాంటి శిక్ష వేశారని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్‌.

ఇవి కూడా చదవండి

రాహుల్‌కు సూరత్‌ కోర్టులో ఎదురుదెబ్బ..

మరోవైపు, జైలు శిక్ష తీర్పుపై రాహుల్‌కు సూరత్‌ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దిగువ కోర్టు విధించిన శిక్షపై స్టే ఇవ్వాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో ఆయన గుజరాత్‌ హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..