Fodder Scam: దాణా కుంభకోణం కేసులో అరెస్టు అయి శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)కు బెయిల్ మంజూరైంది. లాలూకు జార్ఖండ్ హైకోర్టు (Jharkhand High Court) బెయిల్‌ను మంజూరు చేసింది. ఐదు సంవత్సరాల పాటు శిక్ష పడిన దాణా కుంభకోణం కేసులో.. లాలూ ఇప్పటికే 42 నెలలు జైల్లోనే గడిపారన్న విషయాన్ని ఆయన తరపున న్యాయవాది కోర్టకు తెలిపారు. సీబీఐ వ్యతిరేకించినా డోరండ ట్రెజరీ కేసులో లాలూకు కోర్టు బెయిల్ ఇచ్చిందని ఆయన తరఫున వాదించిన లాయర్ ప్రభాత్ కుమార్ తెలిపారు.
అయితే ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభంలో ఐదో పశుగ్రాసం కుంభకోణంలో లాలూకు సీబీఐ కోర్టు ఐదేళ్ల శిక్షతోపాటు రూ. 60 లక్షల జరిమానా విధించింది. 1990లో ఈ కుంభకోణం జరిగింది. డోరండ ట్రెజరీ నుంచి రూ. 139.5 కోట్లను చట్ట విరుద్ధంగా విత్ డ్రా చేశారనే ఆరోపణల కారణంగా లాలూపై ఈ కేసు నమోదైంది. ఆ సమయంలో బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ఉన్నారు. దాణా కుంభకోణానికి సంబంధించి మరో కేసు పాట్నాలోని సీబీఐ కోర్టులో పెండింగ్ లో ఉంది. భాగల్పూర్ ట్రెజరీ నుంచి అక్రమంగా నిధులను విత్ డ్రా చేశారంటూ ఈ కేసు నమోదైంది. తాజాగా జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇవి కూడా చదవండి: